కుమురంభీం జిల్లాలోని(Crime) లింగాపూర్ మండలంలో భార్యపై కోపంతో అత్తింటికి నిప్పుపెట్టి అల్లుడు పారిపోయిన సంచలన ఉదంతం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇల్లు పూర్తిగా కాలిపోయి, ఇంట్లోని వస్తువులు బుగ్గిపాలయ్యాయి.
Read Also: Gold Price : భారీగా పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు!

ఘటన వివరాలు:
ఎల్లాపాటార్ గ్రామానికి చెందిన షమాబీకి, జైసూర్ మండల కేంద్రానికి చెందిన ముజాహిద్ బేగ్‌తో(Crime) తొమ్మిది నెలల క్రితం వివాహం జరిగింది. అయితే, ముజాహిద్‌కు ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో, అతడు తరచూ షమాబీతో గొడవ పడుతుండేవాడు. ఈ వేధింపుల కారణంగా షమాబీ సుమారు 20 రోజుల క్రితం పుట్టింటికి (ఎల్లాపాటార్) వెళ్లిపోయింది.
నిన్న, ముజాహిద్ బేగ్ ఎల్లాపాటార్‌లోని భార్య వద్దకు వచ్చి మరోసారి గొడవ పడ్డాడు. గొడవ తీవ్రం కావడంతో, ముజాహిద్ తీవ్ర కోపంతో అత్తింటిలోకి వెళ్లి గ్యాస్ సిలిండర్ పైపును లీక్ చేసి నిప్పంటించాడు. అనంతరం అతడు వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనపై లింగాపూర్ పోలీస్ స్టేషన్(Lingapur Police Station) ఎస్ఐ గంగన్న కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: