తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. (Crime News) ఇంటి నుంచి వెళ్లిన ఓ యువతి హత్యకు గురవడం సిద్దిపేట జిల్లా(Siddipet District) వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన సిద్దిపేట (D) వరంగల్(M) పరిధిలోని నాచారం గ్రామ శివారులో చోటుచేసుకుంది.. వివరాల్లోకి వెళితే.. తూఫ్రాన్(M) ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన జోడు నర్సింహులు కుమార్తె కల్పన(26) భర్తతో గొడవలు కారణంగా తల్లిగారి ఇంటివద్ద ఉంటోంది. ఈ క్రమంలో డిసెంబర్ 30న సాయంత్రం హెల్త్ చెకప్ కోసం హైదరాబాద్ వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. (Crime News)అయితే డిసెంబర్ 31 అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మెడకు వైర్ గట్టిగా బిగించి హత్య చేసి.. మృతదేహాన్ని నాచారం గ్రామ శివారులో పడేసినట్లు గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Read also: Madhya Pradesh: కలుషిత నీటితో 6 నెలల పసికందు మృతి

Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: