ప్రేమ ఎంతో మధురం. దీన్ని వర్ణించేందుకు భాష చాలదు. దేశాలు, ఖండాలు అనే సరిహద్దులు ఉండవు. భాష కులం, మతం పట్టింపులు ఉండవు. మనసైన తోడు ఉంటే చాలనుకుంటారు. వారితో కలిసి ఎడడుగులు నడవాలని తపిస్తారు. కలకాలం కలిసి జీవించాలని నిర్ణయించుకుంటారు. కాళ్లు తడవకుండా సప్త సముద్రాలను దాటగల మేధావి ఉంటాడేమో కానీ ప్రేమ లేని జీవి బతకలేడు. అందుకే జ్ఞాని అయినా, బిక్షగాడికైనా నచ్చిన తోడుకోసం పరితపిస్తుంటారు. ఇలాంటి ఓ యువకుడు తాను ప్రేమించిన ప్రేయసిని పెళ్లాండేందుకు లండన్ నుంచి ఇండియాకు వచ్చాడు. తీరా పెళ్లి చేసుకుందామనుకునే లోగా ఆ యువతి మరొకరికి భార్య అయింది.
Read Also: Kaleshwaram Project: కాళేశ్వరంపై కవిత సంచలన ఆరోపణలు

ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు
నిజామాబాద్ జిల్లా (Nizamabad District) మోర్తాడ్ మండలం దోమచంద గ్రామంలో గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు శ్రీకాంత్ రెడ్డి, అఖిల అనే జంట. అయితే తన ప్రేయసిని పెళ్లాండేందుకు లండన్లో ఉద్యోగం చేస్తున్న శ్రీకాంత్ రెడ్డి సొంత ఊరికి వచ్చాడు. అయితే అఖిల తండ్రి మరో యువకుడితో పెళ్లి చేశాడు. దీన్ని తెలుసుకున్న శ్రీకాంత్ రెడ్డి తీవ్ర మనస్తావంతో పురుగుల మందు తాగి, ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అయితే వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించారు. కానీ అక్కడ చికిత్స పొందుతూ శ్రీకాంత్ రెడ్డి (Srikanth Reddy) మృతి చెందాడు. దీంతో శ్రీకాంత్ మృత దేహాన్ని పోలీసుల వాహనంపై పెట్టి నిరసనకు దిగారు కుటుంబ సభ్యులు. తమకు న్యాయం చేయాలంటూ నిరసన చేస్తున్నారు. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: