హైదరాబాద్ CPI : భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు బుధవారం ప్రారంభం కానున్నాయి. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా గాజుల రామారంలోని మహారాజ గార్డెన్స్ లో ఈ నెల 22 వరకు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్టు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ఏ కూనంనేని సాంబశివరావు (MLA Kunamneni Sambasiva Rao) తెలిపారు. హైదరాబాద్లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయం ముఖాంభవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు వాడ వెంకటరెడ్డి, పశ్యపద్మ, జాతీయ కౌన్సిల్ సభ్యులు పల్లా రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు. కార్యదర్శివర్గ సభ్యులు వి.ఎస్.జోస్, ఈటి నరసింహా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి.జి. సాయిల్ గౌద్. ఆహ్వాన సంఘం అధ్యక్షులు ఎం.డి. యూసుప్, ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్ సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి బి. స్టాలిన్, కౌన్సిల్ సభ్యులు దామోదర్రెడ్డి పాల్గొన్నారు. 100 ఏళ్ల ఘనమైన చరిత్ర ఉన్న సిపిఐ రాష్ట్ర 4వ మహాసభలు ఈ నెల 20(బుధవారం) ప్రారంభంకానున్నాయని…. మూడు రోజుల పాటు జరిగే మహాసభల్లో 743 ప్రతి నిధులతో పాటు ప్రత్యేక ఆహ్వానితులు కలిపి 1000 మంది పాల్గొంటారని తెలిపారు.
మహాసభల్లో భాగంగా మహాసభల బుధవారం ఉదయం 9 గంటలకు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ నుండి మహాసభల వేదికైన మహారాజ గార్డెన్స్ వరకు రెడ్ ఫ్లాగ్ మార్చ్ ఉంటుందన్నారు. ప్రదర్శన ఆనంతరం ఉదయం 10 గంటలకు పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు కందిమళ్ల ప్రతాపరెడ్డి ఆరుణ పతాకాన్ని ఎగురవేయనుండగా 10.15గంటలకు ప్రముఖ కవి, నవ చేతన పబ్లిషింగ్ హౌజ్ సంపాదకులు ఏటుకూరి ప్రసాద్ మృతవీరుల స్థూపాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. ఉదయం 11 గంటలకు రాష్ట్ర 4వ మహాసభలను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా ప్రారంభిస్తార న్నారు.

ఎఐటియుసి మహాసభలు: ప్రజా సమస్యలపై ఉద్యమ కార్యాచరణ
రాష్ట్ర 4వ మహాసభల ప్రాంతానికి ఎఐటియుసి సీనియర్ నాయకులు దివంగత పోట్లూరి నాగేశ్వరరావు నగర్గా నామకరణం చేసినట్లు సాంబశివరావు తెలిపారు. అదేవిధంగా మహసభల ప్రాంగణానికి సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి దివంగత ఎన్. బాలమల్లేష్ పేరును, భోజనశాలకు మేడ్చల్ జిల్లా నాయకులు దివగంత రోయ్యల కృష్ణమూర్తి, కె.సహాదేవల పేర్లను పెట్టామని వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు మహాసభల వేదికగా ఉద్యమ కార్యాచరణను రూపొందించుకోనున్నామని కూనంనేని తెలిపారు. ముఖ్యంగా మతోన్మాద పార్టీ అయిన బిజెపి ఫాసిస్టు విధానాలను అనుసరిస్తూ సిపిఐ మతం, కులం, జాతి, భాషా పేర్లతో చిచ్చు పెడుతూ దేశ ప్రజలను చీల్చిందుకు కుట్ర పనుతోందన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంప్రభుత్వ రంగ సంస్థను నిర్వీర్యం చేసి ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఇప్పటికీ ఆర్టీసిలో ఎన్నికలు నిర్వహించకపోవడం ఆప్రజాస్వామికమని, అదేవిధంగా అసంఘంటిత కార్మికులను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఈ సమస్యలపై మహాసభల అనంతరం ఉద్యమించనున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సిపిఐ, సిపిఎం పార్టీతో పొత్తు ఉంటుందని, అదేవిధంగా కాంగ్రెస్తో స్నేహబంధం కొనసాగుతుందని తెలిపారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :