తెలంగాణ రాష్ట్రంలో గీత కార్మికులకు(Geetha Workers) ఊరటనిచ్చే వార్తను మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గీత కార్మికుల కష్టాలను ప్రభుత్వం అర్థం చేసుకుంటోందని, ఎల్లప్పుడూ వారి పక్షాన నిలబడుతామని తెలిపారు. వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం కాటమయ్య రక్షణ కిట్లను పంపిణీ చేస్తుందని చెప్పారు. ఈ రక్షణ కిట్లు ప్రమాదాల నివారణకు ఎంతో ఉపయోగపడతాయని మంత్రి పేర్కొన్నారు.
వర్షాకాలంలో లక్షల మొక్కల నాటన
రానున్న వర్షాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా తాటి, ఈత మొక్కల నాటనకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని మంత్రి (Ponnam Prabhakar) వెల్లడించారు. ఈ కార్యక్రమం కింద 40 లక్షలకు పైగా మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఇది గీత కార్మికులకు ఉపాధి కల్పించడంలో కాదు, పర్యావరణ పరిరక్షణలో కూడా భాగమవుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు నాటాలన్న పిలుపు
గ్రామీణ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూముల్లో తాటి మొక్కలను నాటేందుకు గీత కార్మికులు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. దీని ద్వారా వారు భవిష్యత్తులో స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం గీత కార్మికుల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.
Read Also : Welfare : జులై 1 నుంచి గడపగడపకు వెళ్లాలి – లోకేశ్