తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారం రాజకీయ వేడి పెంచుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (TPCC Mahesh Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి జరిగిన ఓటమికి ప్రధాన కారణం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమేనని ఆయన ఆరోపించారు. అప్పట్లో పార్టీ ముఖ్యనేతల ఫోన్లు ట్యాప్ చేయడంతో ఎన్నికల వ్యూహాలు బహిర్గతమయ్యాయని చెప్పారు.
650 మంది నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఆరోపణ
మహేశ్ గౌడ్ ప్రకారం, సీఎం రేవంత్ రెడ్డి సహా 650 మంది కాంగ్రెస్ నేతల ఫోన్ నంబర్లు ట్యాపింగ్ లిస్ట్‌లో ఉన్నట్టు వెల్లడించారు. ఈ ట్యాపింగ్ ఘటనపై తాము అప్పట్లోనే అధికారులకు ఫిర్యాదు చేశామని, కానీ ప్రభుత్వం దానిని పట్టించుకోలేదన్నారు. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని ఫోన్లను ట్యాప్ చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు.
కేసీఆర్ సిగ్గుతో తలదించుకోవాలి
ఈ వ్యవహారంలో అప్పటి సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రజల నమ్మకాన్ని దూరం చేయడమే కాకుండా, ప్రజాస్వామ్య విలువలను తూర్పార పడేశారని గౌడ్ విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని పూర్తిగా వెలుగులోకి తెచ్చి, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ వివాదం రాజకీయంగా మరింత ఉత్కంఠ రేపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Also : Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ దుర్ఘటనలో బాల్కనీ నుండి దూకిన మెడికోస్