తెలంగాణ(Telangana) రాష్ట్రంలోని ప్రతి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లిని ప్రతిబింబించే విగ్రహాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth) ఆవిష్కరించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన నమూనాను అనుసరించి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల్లో ఈ విగ్రహాలు నిర్మించబడ్డాయి. హైదరాబాద్‌లో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా, అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసిన విగ్రహాలను రేవంత్ రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం రూ. 5.80 కోట్లు కేటాయించింది.
Read Also: TG Weather: తెలంగాణలో దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు
తెలంగాణ జిల్లాల్లో తల్లి ప్రతిమ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth) సూచనల మేరకు తెలంగాణ తల్లి ప్రతిమను పల్లెటూరి మహిళా రైతు రూపంలో రూపొందించారు. ఆకుపచ్చ చీరకు పసుపు అంచు, నుదుటిపై ఎర్ర బొట్టు, కాళ్లకు కడియాలు, ముక్కుపుడక, మట్టి గాజులు, గుండు పూసల హారం వంటి సంప్రదాయ ఆభరణాలతో విగ్రహాన్ని అలంకరించారు. ఎడమ చేతిలో మొక్కజొన్న, గోధుమ, సజ్జ కంకులను పట్టుకొని చిరునవ్వుతో నిలబడిన రూపంలో విగ్రహాన్ని తీర్చిదిద్దారు.

భూమి నుంచి మొత్తం 18 అడుగుల ఎత్తులో (12 అడుగుల విగ్రహం + 6 అడుగుల దిమ్మె) ఈ ప్రతిమలను నిర్మించారు. ఒక్కో విగ్రహం తయారీకి సుమారు రూ. 17.50 లక్షల వ్యయం అయ్యింది. డిసెంబర్ 9వ తేదీని ప్రభుత్వం “తెలంగాణ తల్లి దినోత్సవం”గా జరుపుకోవాలని నిర్ణయించగా, దాని భాగంగా ఈ ఆవిష్కరణలు నిర్వహించబడింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: