తెలంగాణ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) ఈరోజు నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. దేవరకొండ నియోజకవర్గంలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు బహిరంగ సభలో పాల్గొంటారు. సీఎం (CM Revanth) పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్‌చంద్రపవార్,
Read Also: Liquor Sales: తెలంగాణలో 4 రోజుల్లో రూ. 600 కోట్ల మద్యం అమ్మకాలు
రూ.6.50 కోట్ల విలువైన పనులకు సీఎం శంకుస్థాపన
స్థానిక ఎమ్మెల్యే బాలునాయక్ నిన్న ఏర్పాట్లను పరిశీలించారు.ఈ పర్యటనలో భాగంగా దేవరకొండలో మొత్తం రూ.6.50 కోట్ల విలువైన పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో బీఎన్‌ఆర్ కాలనీలో రూ.2 కోట్లతో పార్కు, ప్రభుత్వ బాలుర కాలేజీలో రూ.2 కోట్లతో స్టేడియం, వాకింగ్ ట్రాక్, రూ.2.50 కోట్లతో భూగర్భ డ్రైనేజీ పనులు ఉన్నాయి.

అనంతరం మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ కింద రూ.11.33 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేస్తారు.సాయంత్రం పట్టణ శివారులోని శేరిపల్లి వద్ద ఏర్పాటు చేసిన ‘ప్రజాపాలన విజయోత్సవ సభ’లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ కూడా పాల్గొంటారని అధికారులు వెల్లడించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: