సదర్ సమ్మేళనంలో సిఎం రేవంత్
హైదరాబాద్ (ముషీరాబాద్) :
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో యాదవులు కీలక పాత్ర పోషిస్తున్నారని, నమ్మినవారి కోసం ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా యాదవులు అండగా నిలబడతారని వారి అండతోనే హైదరాబాద్ ప్రపంచ పెట్టు బడులకు ఆదర్శ నగరంగా మారిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(CM Revanth reddy) ప్రశంసించారు. ఆదివారం లోయర్ ట్యాంక్ బండ్లోని ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్ ఆధ్వర్యంలో అత్యతం వైభవంగా జరిగిన దీపావళి సమ్మేళనంకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా ప్రజలం దరి మధ్య ఐక్యతను పెపొందిస్తూ యాదవ సోదరులు సదర్ ఉత్సవాలను నిర్వహించటం అభినందనీయమని, యాదవ సోదరుల ఖదర్ హైదరాబాద్ సదర్ అని, ఎంతో చరిత్ర కలిగిన సదర్ ఉత్స వాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరినప్పుడు వెంటనే అమోదించటమే కాకుండానిధులు కేటాయించామని గుర్తు చేశారు.
Read also: 31 వరకు ‘ఏక్ భారత్-ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమాలు

యాదవుల సేవాభావం రాష్ట్రాభివృద్ధికి ఆదర్శం
యాదవుల సహకారంతోనే తెలంగాణ (Telangana) రాష్ట్రంను ముందుకు తీసుకువెళ్తామని, వారికి ప్రభుత్వంలో ప్రాతినిధ్యం, సముచిత స్థానం కల్పిస్తామని, ఆ బాద్యత పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా తీసుకుంటా మని స్పష్టం చేశారు. మీకు ఏ సమస్య ఉన్నా ప్రభుత్వం దగ్గరకు వచ్చి చెప్పాలని, మీ సమస్యలు ఏవి మా దృష్టికి తీసుకువచ్చినా, చిత్తశుద్ధితో పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని(CM Revanth reddy) దేశంలోనే ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత నాదని, హైదరాబాద్లో శాంతిభద్రతలను కాపాడే బాధ్యత మీ అందరిదీ అని, యాదవ సోదరుల సహకారంతోనే ఏదైనా సాధ్యమవుతుందని అన్నారు. ఈ సదర్ ఉత్సవాలలో మంత్రులు పొన్నంప్రభాకర్, పొంగు లేటి శ్రీనివాసరెడ్డి, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్రావు, మాజీ ఎంపీ ఎం.అంజన్ కుమార్ యాదవ్, రాజ్యసభసభ్యులు ఎం. అనిల్ కుమార్ యాదవ్, స్థానిక కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also: