తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) వివాదం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈవివాదంపై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో కీలక భేటీ జరిగింది. రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్య కార్యదర్శి (సీఎస్) రామకృష్ణ కలిసి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.ఈ సందర్భంగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో జరిగిన అవకతవకలపై ఏర్పాటైన కాళేశ్వరం కమిషన్ నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రికి అందించారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎప్పుడు అయ్యారు?
7 డిసెంబర్ 2023న రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది?
రేవంత్ రెడ్డి తన రాజకీయ జీవితం తెలుగు దేశం పార్టీ (టిడిపి)లో ప్రారంభించారు. తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి, ఎమ్మెల్యేగా, ఎంపీగా సేవలందించారు. తన కఠినమైన ప్రతిపక్ష వైఖరి, బహిరంగ ప్రసంగాలతో ప్రజల మనసులు గెలుచుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: