CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరాలని, అదే సమయంలో ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాకూడదనే లక్ష్యంతో ఇకపై ‘ఫేస్ రికగ్నిషన్’ (ముఖ గుర్తింపు) విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రతి పథకానికీ దీన్ని వర్తింప చేయాలని స్పష్టం చేశారు. ‘అర్హులకు కచ్చితంగా లబ్ధి జరగాలి. అదే సమయంలో అనర్హులు లబ్ధిపొందకూడదు. ఆసరా పింఛన్లలో ముఖ గుర్తింపు చేపట్టడంతో 3L మంది అనర్హులను తొలగించగలిగాం’ అని కలెక్టర్ల కాన్ఫరెన్సులో చెప్పారు.
Read Also: Shadnagar Raikal Lake: హోలీ వేళ విషాదం.. ఈతకు వెళ్లి గురుకుల విద్యార్థి గల్లంతు
పలు కార్యక్రమాలపై మరింత ఫోకస్ పెట్టాలి
రవాణా శాఖ డేటా ఆన్ లైన్ పూర్తి చేయడంతో పాటు డ్రైవర్లకు కంటి పరీక్షల శిబిరాలు నిర్వహించాలన్నారు. రోడ్ల గుంతలపై వాట్సాప్ నంబర్ ద్వారా సమాచారం సేకరణ, ఓఆర్ఆర్ వెంట చెత్త డంపింగ్‌పై కఠిన చర్యలు, మధ్యాహ్న భోజన బిల్లులు సమయానికి చెల్లింపు, వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు, స్టూడెంట్ హాస్టళ్ల నమోదు తప్పనిసరి, పాఠశాలల్లో డ్రగ్స్‌పై కఠిన నిఘా, ప్రతి కార్పొరేట్ పాఠశాలలో సైకాలజిస్ట్ నియామకం వంటి కార్యక్రమాలపై మరింత ఫోకస్ పెట్టాలని సీఎం రేవంత్ ఆదేశించారు.

ఇక, భూసార పరీక్షలు పూర్తి చేసి రైతులకు సమాచారం అందించడమే కాకుండా.. యూరియా యాప్‌లో మార్పులు చేయాలన్నారు. వ్యవసాయ, పౌర సరఫరాల శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. పంటల వైవిధ్యంపై జిల్లాల వారీగా నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. సోలార్ విద్యుత్ వినియోగంపైనా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: