తెలంగాణ ప్రభుత్వం ఆస్తులపై జరుగుతున్న డబుల్ రిజిస్ట్రేషన్(CM Revanth Reddy) సమస్యను పూర్తిగా నివారించేందుకు పెద్ద సంస్కరణలు చేపట్టింది. ఇప్పటివరకు వ్యవసాయ భూములకే ఉన్న టైటిల్ విధానాన్ని పట్టణ ఆస్తులకూ విస్తరించనుంది. దీంతో యజమానులకు తుది, స్పష్టమైన యాజమాన్య పత్రం లభిస్తుంది.
Read Also: IBomma Ravi: పోలీసులకు ఛాలెంజ్ విసిరిన రవి..చివరకు ఎలా దొరికాడు!

రిజిస్ట్రేషన్ శాఖలో పారదర్శకత కోసం బ్లాక్‌చైన్ ఆధారిత సిస్టం(CM Revanth Reddy) తీసుకొస్తున్నారు. ఈ విధానంతో ఒకసారి నమోదు చేసిన ఆస్తిని మళ్లీ మరొకరికి రిజిస్ట్రేషన్ చేయడం అసాధ్యం. నిషేధిత భూములు, ప్రభుత్వ ఆస్తులపై రిజిస్ట్రేషన్ ప్రయత్నాలను సాఫ్ట్‌వేర్ ఆటోమేటిక్‌గా నిరాకరిస్తుంది.
సర్వే నెంబరు బ్లాక్ సిస్టం ద్వారా మొత్తం భూమి వివరాలు డిజిటల్‌గా చూసి, ఉన్న భూమికి మించి రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఉండదు. వెంచర్లలో రోడ్లు, పార్కుల భూమిని ప్లాట్లుగా మార్చే అక్రమాలకు కూడా చెక్ పడుతుంది. టైటిల్ విధానం అమల్లోకి రావడంతో ఒకే పత్రంలో 40 ఏళ్ల ఆస్తి చరిత్ర, యాజమాన్యం, స్థాన వివరాలు అందుబాటులోకి వచ్చి, రియల్ ఎస్టేట్ మోసాలు, ఆస్తి వివాదాలు గణనీయంగా తగ్గనున్నాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: