తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియలో భాగంగా ఎంపికైన గ్రూప్-1 అధికారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక సూచనలు చేశారు. ఇటీవల హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో ఆయన గ్రూప్-1లో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన కొత్తగా నియమితులైన అధికారులకు బాధ్యతతో పాటు విలువలను గుర్తు చేశారు.
Heavy rains in Hyderabad-తెలంగాణలో పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గ్రూప్-1 పరీక్షలకు మూడు లక్షల మందికి పైగా పోటీ పడిగా 562 మంది ఎంపికయ్యారని తెలిపారు. ఎంపికైన ఉద్యోగులెవరూ (selected employees) తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు.

గ్రూప్-1 ఉద్యోగాలు అమ్ముకున్నానని కొందరు దుష్ప్రచారం
ఒకవేళ తల్లిదండ్రులను పట్టించుకోని పక్షంలో వారి వేతనంలో 10 శాతం తల్లిదండ్రులకు అందేలా చట్టం తీసుకువస్తామని స్పష్టం చేశారు.అంతేకాకుండా, తాను డబ్బులు తీసుకుని గ్రూప్-1 ఉద్యోగాలు (Group-1 Jobs) అమ్ముకున్నానని కొందరు దుష్ప్రచారం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కుట్ర వెనుక కోచింగ్ సెంటర్ల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. పదేళ్లు తెలంగాణ ప్రజలు అవకాశమిస్తే బీఆర్ఎస్ నేతలు విశ్వాసఘాతకులుగా మిగిలిపోయారని ఆయన విమర్శించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: