తెలంగాణలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఈ రోజు (నవంబర్ 25) నుంచి నవంబర్ 30 వరకు వరుస కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఆరు రోజుల పాటు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వివిధ ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు మరియు మంత్రులతో సీఎం సమీక్షా సమావేశాలు జరపనున్నారు.
Read Also: TG: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2025 లోగో విడుదల

ఈ రోజు (నవంబర్ 25) ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ నిర్వహణకు సంబంధించిన కార్యాచరణపై సమీక్షతో సమావేశాలు ప్రారంభమవుతాయి. రేపు (నవంబర్ 26) లాజిస్టిక్స్ మరియు సమ్మిట్ ఏర్పాట్లపై దృష్టి సారిస్తారు. ఆ తర్వాత రోజు (నవంబర్ 27) రాష్ట్రంలోని మౌలిక వసతులు, అభివృద్ధి ప్రణాళికలపై చర్చిస్తారు. నవంబర్ 28న విద్య, యువజన సంక్షేమంపై, 29న వ్యవసాయం, అనుబంధ విభాగాలు, సంక్షేమంపై సుదీర్ఘ సమీక్ష జరగనుంది. చివరి రోజు (నవంబర్ 30) ఆరోగ్యం, వైద్య మరియు కుటుంబ సంక్షేమం వంటి కీలక రంగాలపై ముఖ్యమంత్రి(CM Revanth Reddy) సమీక్ష జరపనున్నారు. ఈ వరుస సమావేశాల ద్వారా ప్రభుత్వం వివిధ రంగాలలో పురోగతిని సమీక్షించడంతో పాటు, రాబోయే సమ్మిట్‌కు సమాయత్తం అవుతోంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read also :