हिन्दी | Epaper
రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్

చిరంజీవి తల్లికి అస్వస్థత వార్తల్లో నిజం లేదు.

Anusha
చిరంజీవి తల్లికి అస్వస్థత వార్తల్లో నిజం లేదు.

మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారని ఉదయం నుంచీ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెల్లవారుజామున ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారని, మెగా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వెళ్లినట్టు వార్తలు వచ్చాయి. దీనితో అభిమానుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.అంజనాదేవి అనారోగ్యం విషయం తెలిసిన వెంటనే, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజయవాడలో ఉన్న తన అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్‌కు చేరుకున్నారని వార్తలు వచ్చాయి. అధికారులతో జరగాల్సిన సమీక్షలు, అనేక కార్యక్రమాలను పవన్ రద్దు చేసుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి. దీంతో అంజనాదేవి ఆరోగ్యం విషయంలో అభిమానులు మరింత ఆందోళనకు గురయ్యారు.

చిరంజీవి టీమ్ క్లారిటీ

అయితే, ఈ వార్తలపై చిరంజీవి టీమ్ అధికారికంగా స్పందించింది. అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఆమె ఆరోగ్యపరమైన సమస్యలు ఏమీలేవని, కేవలం సాధారణ వైద్య పరీక్షల నిమిత్తమే ఆసుపత్రికి వెళ్లారని వెల్లడించారు. గత వారం ఆమె కొన్ని రెగ్యులర్ చెకప్‌లు చేయించుకున్నారని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.

anjana devi 031024 2

ఇటీవలే ఆమె పుట్టినరోజును చిరంజీవి కుటుంబం ఘనంగా జరుపుకుంది. ఈ వేడుకకు సంబంధించిన వీడియోను చిరంజీవి తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ, తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

రెగ్యులర్ చెకప్

అయితే అంజనా దేవి రెగ్యులర్ చెకప్ కోసం హాస్పటల్ కు వెళ్లినట్టు పీఆర్ టీమ్ తెలిపింది. అంజనాదేవికి అస్వస్థత అనే వార్తలు ఒక్కసారిగా రావడంతో అభిమానులు ఉలిక్కిపడ్డారు. ఇప్పుడు ఆమె కేవలం రెగ్యులర్ చెకప్ కోసమే హాస్పటల్ కు వెళ్లారు అని తెలిసి ఊపిరిపీల్చుకున్నారు మెగా ఫ్యాన్స్.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870