Global Summit: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) దూరదృష్టిని మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హృదయపూర్వకంగా అభినందించారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి సినీ–ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా మార్చాలనే సీఎం లక్ష్యం అత్యద్భుతమని ఆయన మెచ్చుకున్నారు. మంగళవారం ఫ్యూచర్ సిటీలో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొన్న అనంతరం, తన అభిప్రాయాలను చిరంజీవి సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
Read Also: AP Government: బియ్యం, చక్కెరతోపాటు రాగులు, గోధుమ పిండి

ఫిల్మ్ ఇండస్ట్రీ భవిష్యత్తుపై చిరంజీవి కీలక వ్యాఖ్యలు
ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన మెగాస్టార్, ‘తెలంగాణ రైజింగ్ – 2047 విజన్’లో భాగంగా సినిమా రంగానికిచ్చిన ప్రాధాన్యత గర్వకారణమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ భారీ ప్రణాళికల్లో తన సూచనలు కోరటం ప్రత్యేక ఆనందం కలిగించిందని ఆయన పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి నాయకత్వం, ప్రభుత్వ సహకారం కొనసాగితే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మరెన్నో గ్లోబల్ స్థాయి చిత్రాలు వెలువడతాయని చిరంజీవి నమ్మకం వ్యక్తం చేశారు. త్వరలోనే ప్రపంచ సినీ పరిశ్రమ దృష్టి హైదరాబాద్‌పై కేంద్రీకృతం కావడం ఖాయం అని విశ్వాసం తెలిపారు. ఈ లక్ష్య సాధనలో తాను పూర్తిగా తోడ్పాటుతో ఉంటానని స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: