రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఇవాళ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రంలో విషాదఛాయలు నింపింది. తాండూరు డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో అతివేగంగా వచ్చిన టిప్పర్ లారీ ఢీకొట్టిన ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 24 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ధృవీకరించారు. మరికొందరు ప్రాణాపాయస్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Read Also: Fee Reimbursement Colleges Bandh : నేటి నుంచి ప్రైవేట్ కాలేజీల బంద్
కంకర లోడ్‌తో ఉన్న టిప్పర్ ఢీకొట్టడంతో బస్సు సగం భాగం నుజ్జు నుజ్జు కాగా.. లారీలోని టన్నుల కొద్దీ కంకర లోడు బస్సులోకి నిండిపోయింది. కంకర బస్సులో పూర్తిగా కూరుకుపోవడం వల్ల ప్రయాణికులకు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వెలుగులోకి వస్తుండగా.. ఒక హృదయ విదారక దృశ్యం అందరినీ కలచివేసింది.

మృతుల్లో 15 నెలల చిన్నారి, ఆమె తల్లి కూడా ఉన్నారు. తల్లి తన ఒడిలో పాపను పట్టుకొని ఉండగానే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. కంకరలో కూరుకుపోయిన ఆ తల్లీబిడ్డల మృతదేహాలను చూసిన స్థానికులు, తోటి ప్రయాణికులు కన్నీరు మున్నీరయ్యారు. అయ్యో దేవుడా.. ఏంటయ్యా ఈ ఘోరం అంటూ గుండెలు బాదుకున్నారు. చిన్నారిని కంకర కుప్ప నుంచి బయటకు తీసే దృశ్యాలను చూసి మనోవేదనకు గురయ్యారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: