Chevella: చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తాండూరుకు చెందిన ముగ్గురు యువతులు తనూష, సాయిప్రియ, నందిని కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందజేయబడింది. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, బాధిత కుటుంబాలకు రూ.5 లక్షలు ప్రభుత్వ తరఫున, రూ.2 లక్షలు ఆర్టీసీ తరఫున అందజేశారు. ముగ్గురు కూతుళ్లను కోల్పోయిన తండ్రి ఎల్లయ్య గౌడ్ చెక్కులు అందుకుంటూ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. “మా కూతుళ్లు పంపిన జీతమా ఇవి?” అని ఆవేదన వ్యక్తం చేశారు. రెండో కూతురు ప్రతి నెలా రూ.60 వేల రూపాయలు పంపేదని చెబుతూ ఆయన విలపించారు. ఈ దృశ్యం చూసి అక్కడున్న వారందరూ కంటతడి పెట్టారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఎల్లయ్యను ఓదార్చి, ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.
Read also: Telangana: తెలంగాణ సర్కారు బడుల్లో కంప్యూటర్ టీచర్లు..
Chevella: ఈ ఘోర ప్రమాదం టిప్పర్ లారీ అధిక వేగం కారణంగా జరిగిందని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, మలుపు వద్ద టిప్పర్ డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సును ఢీకొట్టాడని తెలిపారు. ఆర్టీసీ బస్సుకు పూర్తి ఫిట్‌నెస్ ఉందని, డ్రైవర్‌కు గతంలో ఎలాంటి ప్రమాద రికార్డులు లేవని ఆర్టీసీ ఎండీ స్పష్టం చేశారు. మరోవైపు, టిప్పర్ యజమాని మాత్రం ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ఇదే సమయంలో, తెలంగాణ (Telangana) రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TGHRC) ఈ ఘటనపై సుమోటో కేసు నమోదు చేసి, రవాణా, హోం శాఖలు, జిల్లా కలెక్టర్, ఆర్టీసీ అధికారుల నుంచి డిసెంబర్ 15లోపు పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: