రంగారెడ్డి రోడ్డు ప్రమాదంపై మంత్రి పొన్నం స్పందన
రంగారెడ్డి(Ranga Reddy) జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు(Chevella Accident) ప్రమాదంపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రంగారెడ్డి కలెక్టర్, ఆర్టీసీ ఎండీలతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి, గాయపడిన వారికి తక్షణమే ఉత్తమ వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి కారణం టిప్పర్ లారీ తప్పు దారిలో వచ్చి బస్సును ఢీకొట్టడమేనని అధికారులు తెలిపారని మంత్రి వెల్లడించారు. ఆర్టీసీ అధికారులు వెంటనే ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు.
Read also: మాటకందని వేదన.. వైరల్ అవుతున్న వీడియోలు

ప్రమాదంపై విచారణ, మృతుల కుటుంబాలకు భరోసా
ఈ ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. గాయపడిన వారికి అవసరమైన వైద్యం అందుతోందని, పరిస్థితిని సమీక్షించేందుకు ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించామని చెప్పారు. 72 మంది ప్రయాణికులతో వస్తున్న బస్సును కంకర టిప్పర్ ఢీకొట్టిందని వివరించారు. మృతుల కుటుంబాలకు సాయం అందించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అనంతరం ఆయన చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.
ఎమ్మెల్యే యాదయ్యపై ఉద్రిక్తత
ప్రమాద స్థలానికి వచ్చిన ఎమ్మెల్యే యాదయ్యను స్థానికులు అడ్డుకున్నారు. ఆయనపై దాడి చేయడానికి ప్రయత్నం జరిగిందని సమాచారం. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా “యాదయ్య డౌన్ డౌన్” అంటూ నినాదాలు చేశారు. గ్రామస్తుల జోక్యంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ప్రమాదం ఎలా జరిగింది?
చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును(Chevella Accident) కంకర లారీ ఢీకొట్టింది. రహదారిపై ఉన్న గుంతను తప్పించబోయి లారీ బస్సుపై ఒరిగింది. ఈ ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గాయపడిన వారిని చేవెళ్ల ప్రభుత్వాసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు.
సహాయక చర్యల్లో పాల్గొన్న చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్ జేసీబీ ఎక్కి గాయపడ్డారు. ఆయనను ఆసుపత్రికి తరలించారు. బస్సు కండక్టర్ రాధ స్వల్ప గాయాలతో చికిత్స పొందుతోంది. బస్సులో చిక్కుకున్న వారిలో 15 మందిని రక్షక సిబ్బంది బయటకు తీశారు.
తాండూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న బస్సును ఎదురుగా వచ్చిన కంకర లారీ ఢీకొట్టడంతో లారీలో ఉన్న కంకర ప్రయాణికులపై పడింది. దీంతో వారు కింద చిక్కుకుపోయారు. మూడు జేసీబీల సాయంతో రక్షణ చర్యలు చేపట్టారు. ప్రమాదం హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై చోటుచేసుకోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: