హైదరాబాద్ (నాంపల్లి) : ఆంగ్లం తదితర ఎన్నిభాషలు నేర్చుకున్నా మాతృ భాష తెలుగును మరచిపోరాదని, ప్రభుత్వాలు కూడా కనీసం పాఠశాల స్థాయి వరకైనా విద్యార్థులకు తెలుగుభాషలో బోధన చేయడం, ప్రతీఒక్కరి మాతృభాష (mother tongue)ల్లో బోధన ఎంతో అవసరమని మహారాష్ట్ర పూర్వ గవర్నరు సిహెచ్.విద్యాసాగర రావు (CH. Vidyasagar Rao) అన్నారు.

మాతృభాష రానివాడు మేధావి కాలేడు
మాతృభాష రానివాడు ఎప్పటికీ మేధావి కాలేడని స్పష్టం చేశారు. తెలుగుభాషను ఎంతో చులకచేసి తెలుగుభాషలో మాట్లాడడం కూడా తగదని శాసించిన నిజాం ప్రభువును ఎదిరించి తెలుగుభాష , తెలంగాణ కోసం వీరోచితంగా తన కవిత్వం ద్వారా చైతన్యపరిచి ఉద్యమోన్ముఖులను చేసిన మహోన్నతకవి దాశరథి (Poet Dasarathi) అని కొనియాడారు. దాశరథి శతజయంతిని సంవత్సరం పొడుగునా జరుపుతూ ఆయన గురించి తరతరాలకు తెలపాల్సిన ఆవశ్యకత ఉందని స్పష్టం చేశారు. ఉభయ తెలుగురాష్ట్రాల్లో తెలుగు భాషాభ్యున్నతికి తనవంతు బాధ్యతగా కృషిచేస్తానని భరోసా నిచ్చారు. అలాగే ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న తెలంగాణ భాషానిలయం అభివృద్ధికి తనవంతు సహాయసహకారాలు అందిస్తానని భరోసా నిచ్చారు. తెలంగాణ కవుల ప్రతినిధి దాశరథి, దాశరథి అంటేనే తెలంగాణ వీరరసం ఉప్పొంగిపోతుందని, ఆయన నినదించి తెలంగాణ ఓం నమో నారాయణాయ గాణ ఉద్యమానికి ఊపిరి పోసి రాష్ట్ర సాకారానికి కారణమైన 12 అక్షరాల తెలంగాణ కోటి రతనాల వీణ ఒక ఓం నమఃశివాయ పంచాక్షరి, అష్టాక్షరీ మంత్రాలు ఎలాగో అలాగే దేశభక్తిని దైవభక్తిగా భావించిన మహానుభావుడు దాశరథి ఉచ్చరించిన నా తెలంగాణ కోటి రతనాల వీణ ద్వాదశాక్షరి అని తెలంగాణ ప్రభుత్వ పూర్వ సలహాదారు, విశ్రాంత ఐఎఎస్ అధికారి, భాషానిలయం అధ్యక్షుడు డా. కె.వి. రమణాచారి అభివర్ణించారు.
నా తెలంగాణ కంజాతవల్లి, తెలంగాణలేమ సౌందర్యసీమ, కోటి అందాల జాన, రతనాల వీణ అని దాశరథి అన్నాడని గుర్తుచేశారు. శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం ఆధ్వర్యంలో మహాకవి దాశరథి కృష్ణమాచార్య శతజయంత్యుత్స వాన్ని పురస్కరించుకొని తెలుగు భాషా నిలయంలోని రావిచెట్టు రంగారావు సభామందిరంలో తెలంగాణ ప్రభుత్వ పూర్వ సలహాదారు. భాషానిలయం అధ్యక్షుడు, విశ్రాంత ఐఎఎస్ అధికారి డా. కె.వి.రమణాచారి సభాధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల పూర్వ గవర్నరు సిహెచ్. విద్యాసాగరరావు (CH. Vidyasagar Rao) విశిష్ట అతిథులు స్మారక ప్రసంగకర్త యువ పరిశోధకుడు, కవి శరత్చంద్ర, గౌరీశంకర్, కార్పొరేటర్ సురేఖ, భాషా నిలయం గౌరవ కార్యదర్శి టి. ఉడయవర్లు తదితరులతో కలిసి ముందుగా దాశరతి చిత్రపటానికి పూలమాలవేసి ఘననివాళులర్పించి, భాషానిలయం రూపొం దించిన దాశరథి కవిత గ్రంథాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. సభకు టి.ఉడయవర్లు స్వాగతో పన్యాసంలో భాషానిలయం పుట్టుపూర్వోత్త రాలను, చేసిన చేస్తున్న కార్యక్రమాలు, కళాసేవలను సంక్షిప్తంగా వివరించారు. ఈ సందర్భంగా అతిథుల చేతులమీదుగా దాశరథి కవిత్వం-వ్యక్తిత్వంపై పాఠశాలస్థాయి విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు బహుమతులను ప్రదానం చేసి శుభాశీస్సులందజేశారు. అనంతరం డా. శరత్చంద్ర మహాకవి దాశరథి కవిత్వం-వ్యక్తిత్వం- సినిమా పాటలు అంశాలపై స్మారక ప్రసంగం కావించారు .
Read hindi news: hindi.vaartha.com
Read also: TGCSB: టిజిసిఎస్బి ఆధ్వర్యంలో సైబర్ వారియర్లు, అధికారులకు ప్రత్యేక శిక్షణ