ఆరు గ్యారంటీల అమలులో నిర్లక్ష్యం: బిఆర్ఎస్ విజయోత్సవ సభకు భారీగా తరలిరావాలి: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
BRS : జగిత్యాల జిల్లా కేంద్రంలోనిజిల్లా BRS పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలులో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించి ప్రజలను మోసం చేసిందని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలను ప్రజలు నమ్మవద్దని కవిత తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలను బెదిరించడం, మోసం చేయడం తప్ప, తెలంగాణలో అభివృద్ధి జరగడం లేదని ఆయన అన్నారు.కవిత కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు చేస్తూ, 2004లో ప్రజలను మోసం చేసినట్లు, ఇప్పుడు మళ్లీ అదే పని చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఉచిత బస్సు సౌకర్యం గురించి చెప్పడం, కానీ బస్సుల సంఖ్య పెంచకపోవడం వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. “ఉచిత బస్సు ఇచ్చామని చెబుతున్న కాంగ్రెస్, మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తోంది,” అని ఆమె పేర్కొన్నారు. అలాగే, రేవంత్ రెడ్డి బంగారం ఇవ్వమని మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు.

జగిత్యాల నిధుల అంశంపై, సంజయ్ విఫలమయ్యాడని కవిత అభిప్రాయపడ్డారు. మంత్రివర్గ సభ్యుడు కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడేందుకు అనేక ఉద్యమాలు, పోరాటాలు జరిగాయని, కేసీఆర్ దీక్ష ద్వారా తెలంగాణ సాధించుకున్నారని తెలిపారు. మాజీ మంత్రి రాజేశం గౌడ్ మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకముందు తెలంగాణ ప్రజలు అనేక రకాల సమస్యలను ఎదుర్కొన్నారు అని చెప్పారు.ఈ సమావేశంలో మాజీ జెడ్డి చైర్మన్ దావా వసంత సురేష్ మాట్లాడుతూ, తన రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని, కవిత నాయకత్వంలో జగిత్యాల జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి చెందినట్లు పేర్కొన్నారు. ఈ నెల 27వ తేదీన జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ సభకి అధిక సంఖ్యలో ప్రజలు హాజరుకావాలని కవిత కోరారు.ఈ సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు కొరుగంటి రమణారావు, బాబు రెడ్డి, గట్టు సతీష్, వల్లెం మల్లేశం, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Read more : Bandla Ganesh: పవన్ కళ్యాణ్ ఆరోగ్యం పై స్పందించిన బండ్ల గణేష్