బీఆర్‌ఎస్ పార్టీ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath ) (62) ఆదివారం ఉదయం 5.45కి తుదిశ్వాస విడిచారు. గత కొద్దికాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఈ నెల 5న ఛాతీ నొప్పితో హుటాహుటిన గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రి(AIG)లో చేరారు. కార్డియాక్ అరెస్టు తర్వాత సీపీఆర్ నిర్వహించడంతో గుండె తిరిగి కొట్టినా, అపస్మారక స్థితి నుంచి పూర్తిగా కోలుకోలేకపోయారు. మూడు రోజుల పాటు చికిత్స పొందిన గోపీనాథ్ ఆరోగ్యం విషమించడంతో ఆదివారం ఉదయం (Maganti Gopinath Died) ఆయన మరణించారు.
జూబ్లీహిల్స్ నుండి మూడుసార్లు ఎమ్మెల్యే
మాగంటి గోపీనాథ్ రాజకీయ జీవితం విషయానికి వస్తే.. 1985 నుండి 1992 వరకు తెలుగు యవత రాష్ట్రాధ్యక్షుడిగా పని చేసిన ఆయన, 2014లో తొలిసారిగా టీడీపీ తరఫున జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. తర్వాత బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన ఆయన, 2018లో కాంగ్రెస్ అభ్యర్థి పీ. విష్ణువర్ధన్ రెడ్డిపై విజయం సాధించారు. ఇటీవల జరిగిన 2023 ఎన్నికల్లో మళ్ళీ గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేశారు. మజ్లిస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులపై వరుసగా విజయాలు సాధించిన మాగంటి గోపీనాథ్, జూబ్లీహిల్స్ ప్రజల మన్ననలు పొందారు.
బీఆర్ఎస్‌లో మాగంటి గోపీనాథ్‌కు ప్రత్యేక స్థానం
బీఆర్ఎస్‌లో మాగంటి గోపీనాథ్‌కు ప్రత్యేక స్థానం ఏర్పడింది. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, హైదరాబాద్ నగర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన ఆయన, బీఆర్‌ఎస్ జెండాను జూబ్లీహిల్స్‌లో గర్వంగా రెపరెపలాడించారు. మాగంటి గోపీనాథ్ మృతి రాష్ట్ర రాజకీయ రంగానికే కాదు, జూబ్లీహిల్స్ ప్రజలకు పెద్ద లోటు అని నాయకులు అభిప్రాయపడుతున్నారు. పలువురు రాజకీయ ప్రముఖులు, కార్యకర్తలు ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : Fish Prasadam Distribution : నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ