BRS leader Balka Suman: మంచిర్యాల జిల్లా చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ (BRS) జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్కు సోమవారం మంచిర్యాల జిల్లా కోర్టులో ఊరట లభించింది. క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సమయంలో జరిగిన అల్లర్ల కేసులో రిమాండ్లో ఉన్న ఆయనకు జిల్లా జడ్జి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బెయిల్ మంజూరు కోసం కోర్టు పలు నిబంధనలను విధించింది. రూ. 25,000 విలువ గల ఎగ్జిక్యూటివ్ బాండ్ పాటు, ఒక్కొక్కరికి ఇద్దరు షూరిటీలను సమర్పించాలని ఆదేశించింది.
Read Also: Telangana Agriculture: సబ్సిడీపై వ్యవసాయ డ్రోన్ల పంపిణీ

బాల్క సుమన్ కు షరతులతో బెయిల్
అదేవిధంగా, ప్రతి ఆదివారం మధ్యా హ్నం 12 గంటల నుండి 2 గంటల మధ్యలో రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్కు స్వయంగా హాజరై సంతకం చేయాలని స్పష్టం చేసింది. ఈ నిబంధనలు రాబోయే మూడు నెలల పాటు లేదా కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసే వరకు అమలులో ఉంటాయని జడ్జి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గత కొద్దిరోజులుగా రిమాండ్లో ఉన్న బాల్క సుమన్కు బెయిల్ రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com