శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు (Rajiv Gandhi International Airport) మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. అరైవల్ ప్రాంతంలో ఆర్‌డీఎక్స్ బాంబు ఉంచినట్లు ఆగంతకులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం బెదిరింపు మెయిల్ పంపారు. అప్రమత్తమైన పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. సందర్శకుల పాసుల కౌంటర్ మూసివేశారు. ఎయిర్‌పోర్ట్ (Shamshabad Airport) లో తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
Read Also: Minister Ponnam: ఎన్ఫోర్స్మెంట్స్ ను మరింత కఠినతరం చేయాలి

బూటకపు బెదిరింపు
అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. దీంతో అది బూటకపు బెదిరింపుగా తేల్చినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, రెండు రోజుల క్రితం కూడా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ (Shamshabad Airport) కు ఇలాంటి బెదిరింపులే వచ్చిన విషయం తెలిసిందే. ఇలా వరుస బెదిరింపులతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: