తెలంగాణ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోబోతున్నాయనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ ప్రచారాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు గట్టిగా ఖండించారు. వచ్చే ఎన్నికల్లో కమలం పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. గతంలో ప్రజలు బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్‌కు అవకాశాలు ఇచ్చారని, ఈసారి బీజేపీకి పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే కొందరు ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
Read also: Rampally Dayara: కేటీఆర్ చేతుల మీదుగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం!

Ramchandra Rao’s key comments on BJP’s alliance with BRS
చమురు నిల్వలపై ప్రజలకు భరోసా
ప్రస్తుతం ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల భారత్‌లో పెట్రోల్ కొరత ఏర్పడుతుందనే వార్తలపై ఆయన స్పందించారు. దేశంలో చమురు కొరత వచ్చే ప్రసక్తి లేదని, సరిపడా నిల్వలు ఉన్నాయని హామీ ఇచ్చారు. గతంలో భారత్ కేవలం కొన్ని దేశాల నుంచే చమురు కొనుగోలు చేసేదని, కానీ ఇప్పుడు మోదీ ప్రభుత్వం 47 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోందని వివరించారు. దీనివల్ల అంతర్జాతీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడదని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ తీరుపై రాంచందర్ రావు విమర్శలు
కాంగ్రెస్ పార్టీ మరియు రాహుల్ గాంధీ యుద్ధం పేరుతో ప్రజల్లో అనవసర భయాలను కలిగిస్తున్నారని రాంచందర్ రావు మండిపడ్డారు. గతంలో యూపీఏ ప్రభుత్వం ఇరాన్‌కు వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ నాయకులు ద్వంద్వ ప్రమాణాలతో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్ధిని కాంగ్రెస్ గాలికొదిలేసిందని, హైదరాబాద్ నగర భద్రత విషయంలో కూడా రాజీ పడుతోందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్తు కేవలం బీజేపీతోనే సాధ్యమని ఆయన పునరుద్ఘాటించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: