హైదరాబాద్: భూభారతి ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ (Technical Staff)సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి చాలా సందర్భాల్లో విన్నవించామని, తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మైన్ వి. లచ్చిరెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వ టెక్నికల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా ప్రభుత్వం గుర్తించిందన ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. అంతే కాకుండా వీరికి ప్రతినెల రూ.21,446 వేతనం ఇవ్వనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ నిర్ణయం తో రాష్ట్రవ్యాప్తంగా 708 మందికి మేలు జరుగుతుందని, ఎన్నో యేండ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ సమస్యను దసరా పండుగకు ముందు పరిస్కరించి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపిన సిఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి, డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుకి, సీసీఎస్ఏ కమిషనర్కి, రెవెన్యూ సెక్రటరీకి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శికి ప్రత్యేక కృతజుతలు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: