తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) సోమవారం ఫ్యూచర్ సిటీలో ప్రారంభమైన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ లో (Telangana Rising Global Summit) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రానికి ఆశయం ఎప్పుడూ లేకపోలేదని, కానీ ఆ ఆశయాన్ని చాలా కాలం పాటు సమగ్ర దృక్పథంతో కొనసాగించలేకపోయిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ఇంటిగ్రేటెడ్ ఫ్రేమ్‌వర్క్ ఉందని, తమ లక్ష్యం కేవలం వచ్చే ఏడాదికో లేదా వచ్చే ఎన్నికల నాటికో పెట్టుకోలేదని, 2047కు పెట్టుకున్నామని స్పష్టం చేశారు.
Read Also: Global Summit 2025: గ్లోబల్ సమ్మిట్ ప్రముఖులకు ‘రోబో’ ఆహ్వానం
- ఆర్థిక లక్ష్యం: మూడు ట్రిలియన్ డాలర్ల (Three Trillion Dollar) ఎకానమీని సృష్టిస్తామని చెప్పడం కేవలం నినాదం (స్లోగన్) కాదని, అంచలంచెలుగా దాన్ని చేరుకునేందుకు ప్రణాళిక ఉందని తెలిపారు. ఈ లక్ష్యం తెలంగాణ వాస్తవాన్ని మార్చే శక్తి అని, ప్రతి పాఠశాలకు, ఆవిష్కరణకు, గ్రీన్ ఇనిషియేటివ్‌కు కావలసిన ఆర్థిక బలం అని వివరించారు.
- సమ్మిళిత వృద్ధి: సమ్మిళిత వృద్ధి కోసం వెనక్కి తగ్గకుండా కమిట్‌మెంట్‌తో పనిచేస్తామని, అభివృద్ధి ప్రయాణంలో ఎవరూ వెనుకబడకూడదన్నది తెలంగాణ ప్రజా ప్రభుత్వ నినాదమన్నారు. మహిళా శక్తి నుండి రైతు భరోసా వరకు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ వరకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సమానత్వ నిర్మాణం కోసమే అని పేర్కొన్నారు.
- పర్యావరణం: 2047 నాటికి నెట్ జీరో సాధించడమే లక్ష్యమన్నారు. ఆర్థికాభివృద్ధి, పర్యావరణం ఒకదానికొకటి విరుద్ధం కాదని, ఇకపై ఇవి పరస్పర సహకారాలని స్పష్టం చేశారు.

తెలంగాణ విజన్ డాక్యుమెంట్: ప్రజాస్వామ్య ప్రక్రియ
తెలంగాణ (Telangana) విజన్ డాక్యుమెంట్ అనేది మూసివేసిన గదుల్లో రాసిన పత్రం కాదని, ప్రముఖుల సలహాలు, నిపుణుల చర్చలు, పౌరుల అభిప్రాయాలతో కింది నుంచి పైకి వచ్చిన ప్రజాస్వామ్య ప్రక్రియ అని భట్టి వివరించారు. ఇది ప్రభుత్వపు పత్రం మాత్రమే కాదని, తెలంగాణ ప్రజల పత్రం అని ఆయన పేర్కొన్నారు. ఈ సమగ్ర డాక్యుమెంట్‌ను ఈరోజు ఆవిష్కరిస్తున్నామన్నారు.
విజన్ నాలుగు స్తంభాలు: క్యూర్, ప్యూర్, రేర్ మోడల్
తమ విజన్ నాలుగు స్తంభాలపై నిలబడి ఉందని భట్టి వివరించారు:
- 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ (సమగ్ర కార్యాచరణ ప్రణాళిక).
- స్పేషియల్ ప్లానింగ్‌కు కొత్త వ్యాకరణం – క్యూర్, ప్యూర్, రేర్ మోడల్.
- సమగ్ర అభివృద్ధిపై అచంచల కట్టుబాటు.
- సస్టైనబిలిటీని (Sustainability) ఆవిష్కరణాత్మకంగా సహకారం చేయడం.
‘క్యూర్, ప్యూర్, రేర్ (CURE, PURE, RARE)’ మోడల్ వివరణ:
- క్యూర్ (CURE – Core Urban Region Economy): ఇది హైదరాబాద్ అత్యంత చురుకైన రూపం. ఏఐ (AI), ఏరోస్పేస్, జీనోమిక్స్, ఫ్యూచర్ ఇండస్ట్రీల కేంద్రంగా ఉంటుంది. క్యూర్ ఆవిష్కరిస్తుంది (innovates).
- ప్యూర్ (PURE – Peri-Urban Region Economy): ఉతపత్తి, పరిశ్రమలు, లాజిస్టిక్స్ జరిగే శక్తివంతమైన ప్రాంతం. ప్యూర్ అందిస్తుంది (supplies).
- రేర్ (RARE – Rural Agricultural Region Economy): వ్యవసాయ భూములు, అడవులు, పచ్చని ఊపిరితిత్తులు. ఇవి అగ్రి, ఎంట్రప్రెన్యూర్‌షిప్, ఇకోటూరిజం, కార్బన్ ఎకానమీకి ఇంజిన్లు. రేర్ నిలబెడుతుంది (sustains).
ఈ మూడు కలిసి తెలంగాణ మొత్తం అభివృద్ధి కథను ఒక దండలో దారంతా ఒక చోటుకు చేరుస్తాయని తెలిపారు.
కొత్త ప్రపంచంలో భాగస్వాములు కావడానికి వచ్చిన అందరికీ స్వాగతం పలుకుతూ, తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన సంస్థల పేర్లను రోడ్లు, మౌలిక వసతులకు పెట్టడం ద్వారా యువతలో ప్రేరణ కలిగించడమే తమ ప్రభుత్వ ఉద్దేశ్యమని ఆయన అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: