పిల్లలు చదువుతోపాటు క్రమశిక్షణగా మెలగాలని అందరూ కోరుకుంటారు. పాఠశాలలే వారికి క్రమశిక్షణాలయాలుగా(disciplinary institutions) ఉంటాయి. ఎందుకంటే పిల్లల్ని క్రమశిక్షణలో, భయంభక్తిలో పెంచే బాధ్యతను ఉపాధ్యాయులే ఎక్కువగా తీసుకుంటారు. విద్యార్థులకు క్రమశిక్షణ మంచిదే. బెత్తం వాడని ఉపాధ్యాయుడు పిల్లలకు శత్రువు అవుతాడని చెబుతారు. కాబట్టి విద్యార్థులు జీవితంలో బాగుపడాలంటే ఉపాధ్యాయుడు అవసరమైనప్పుడు బెత్తంతో కొట్టాలి. అదికూడా వారి మేలు కోసమై ఉండాలి. కానీ ఇప్పుడు అలా కొట్టడం చట్టాలు ఒప్పుకోవు. ఇదంతా ఎందుకు
చెబుతున్నానని అనుకుంటున్నారా..ఓ టీచర్ విద్యార్థి అల్లరి చేస్తే తలపై కొట్టింది. ఇంకేం ఆ విద్యార్థి పుర్రె ఎముక విరిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో బాగా వైరల్ అవుతున్నది. ఈ ఉదంతానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బాలిక తలపై చితకబాదిన టీచర్
క్లాస్ రూంలో అల్లరి చేస్తోందని బాలిక తలపై చితకబాదింది టీచర్. దీంతో బాలిక పుర్రె ఎముక విరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. చిత్తూరు జిల్లా పుంగనూరులోని భాష్యం స్కూల్లో నాగశ్రీ అనే విద్యార్థిని ఆరో తరగతి చదువుతోంది. అయితే ఈనెల 10న నాగశ్రీ క్లాస్ రూమ్ లో అల్లరి చేసిందని సలీంబాషా అనే ఉపాధ్యాయుడు బాలిక తలపై బ్యాగ్ తో బలంగా కొట్టాడు. ఆ తర్వాత స్కూలు నుంచి ఇంటికి వెళ్లిన ఆ బాలిక తీవ్రమైన తలనొప్పి, వాంతులు, విరోచనాలు అంటూ అల్లాడిపోవడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు.
పుర్రె ఎముక విరిగింది
చిన్నారిని పరీక్షించిన వైద్యులు తలకు బలమైన దెబ్బ తగిలినట్లుగా గుర్తించారు. హెడ్ ను స్కానింగ్ (Head Scanning)చేయగా.. పుర్రె ఎముక విరిగినట్లుగా తేలింది. దీంతో తల్లిదండ్రులు స్కూలు యాజమాన్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు టీచర్పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. లక్షలకు లక్షలు ఫీజులు కట్టి పిల్లల్ని స్కూళ్లకు పంపితే చంచేంతలా కొడతారా అంటూ తల్లిదండ్రులు టీచర్పై మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
చిన్నారి తల పగలగొట్టిన ఘటన ఎక్కడ జరిగింది?
ఈ ఘటన తెలంగాణలోని ఒక పాఠశాలలో చోటుచేసుకుంది.
టీచర్‌పై ఏ చర్యలు తీసుకున్నారు?
టీచర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Read hindi news: hindi.vaartha.com
Read also: