हिन्दी | Epaper

Beerla Ilaiah: వాగ్దానాలు అమలు చేయకుండా మోసగించిన కెసిఆర్

Rajitha
Beerla Ilaiah: వాగ్దానాలు అమలు చేయకుండా మోసగించిన కెసిఆర్

ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

హైదరాబాద్ : కెసిఆర్ పదేళ్ల పాటు అధికారంలో ఉండి కనీసం సగం హామీలను కూడా నేర్చక ప్రజలను మోసం చేశారని అందుకే ఆబిఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిందనీ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆరోపించారు. మంగళవారం సిఎల్పీలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ అన్ని వర్గాలను ఘోరాతీఘోరంగా మోసం చేసిన చరిత్ర కెసిఆర్ దనీ అన్నారు. జళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి దగా చేశారనీ మోసాల చిట్టాను చదివారు. దళిత బంధు పేరుతో మోసం చేశారు, గిరిజనులకు మూడెకరాల భూమి అని మూడు అడుగులు కూడా ఇవ్వలేదు. బిసిలకు బిసిబంధు అని చెప్పి ద్రోహాం వేశారనీ ఆయన విమర్శించారు. రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామని చెప్పి అన్యాయం చేశారనీ తెలిపారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసం చేశారనీ ఉద్యోగాలు భర్తీ చేయకుండా అన్యాయం చేశారనీ ఆయన వివరించారు. కెసిఆర్ చేసిన మోసం అంతా ఇంతా కాదు అందుకే అసెంబ్లీతో పాటు అనేక ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని చిత్తుగా ఓడించారనీ భాష్యం చెప్పారు.

Read also: Velugumatla Demolition : వెలుగుమట్ల వివాదం.. ఎక్కడ కూల్చారో అక్కడే వారికి ఇళ్లు

Beerla Ilaiah: KCR deceived by not fulfilling promises

Beerla Ilaiah: KCR deceived by not fulfilling promises

ఓటమి నుంచి పాఠం నేర్చుకోలేదని అందుకే మార్పు రావడం లేదని దుయ్యబట్టారు. కెటిఆర్ నీకు దమ్ముంటే ప్రతి పక్ష నేత కెసిఆర్ ను అసెంబ్లీకి తీసుకురా అని సవాల్ చేశారు. ఆయన ప్రతి ప్రశ్నకు ప్రభుత్వం. మా ముఖ్యమంత్రి సమాధానం చెపుతారనీ అన్నారు. ప్రతిపక్ష నాయకుడి ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టి నువ్వు, హరీష్ రావు కుట్ర చేస్తానంటే చూస్తూ ఉర్కొంటన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన చూసి ఓర్వలేక అసెంబ్లీని అడ్డుకుంటామని చెప్పుతున్నాడనీ ఆవేదన చెందారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సమావేశాల కోసం శిక్షణా తరగతులు పెట్టారనీ దీనికి సంతోషంగా ఉందని అయితే అసెంబ్లీ ని ఎలా అడ్డుకోవాలన్న దానిపైనే వాళ్లకు శిక్షణను ఇచ్చినట్లు కెటిఆర్ మాటలను చూస్తే అర్థమోతోందనీ ఆపాదించారు.

దళితులు మరియు గిరిజనులకు తీరని అన్యాయం

ఆరు గ్యారెంటీల అమలు పైన అసెంబ్లీ లో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతామని కెటిఆర్ అనడం ఆయనకు తగదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇప్పటికే రెండున్నర యేళ్లు కూడా కాలేదనీ అంటే సగం కాలపరిమితి కూడా పూర్తి కాలేదు అప్పుడే హామీలపైన కెటిఆర్ ఎగిరెగిరి పడుతున్నారనీ అన్నారు. ఇప్పటికే సాధ్యమైన హామీలన్నింటిని నేరవేర్చామని తెలిపారు. మేం చెప్పని పథకాలను కూడా అమలు చేస్తున్నామనీ అన్నారు. రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు, వడ్డీలేని రుణాలు, సన్న బియ్యం, రైతు భరోసా, వరికి 500 రూపాయల బోనస్ వంటివి నీ కళ్లకు కనిపించడం లేదా..? అని ఆయన ప్రశ్నించారు. కెసిఆర్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చినా మా ముఖ్యమంత్రి గుండె ధైర్యంతో పోరాటం అసెంబ్లీని అడ్డుకుంటే వదిలిపెట్టమని తెలిపారు. బచ్చా గానివి నువ్వు తండ్రి చాటున వచ్చి మంత్రివి అయ్యావనీ విమర్శించారు. అసెంబ్లీలో ఏ అంశమైన అయినా మేం చర్చకు సిద్ధమని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రియురాలు పెళ్లికి ఒప్పుకోలేదనీ యువకుడు ఆత్మహత్య

ప్రియురాలు పెళ్లికి ఒప్పుకోలేదనీ యువకుడు ఆత్మహత్య

హైదరాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠా అరెస్ట్
0:52

హైదరాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠా అరెస్ట్

ఆరోగ్యానికి మంచిదంటున్న ఇప్పపూల సారా.. ఎమ్మెల్యే అనిరుధ్

ఆరోగ్యానికి మంచిదంటున్న ఇప్పపూల సారా.. ఎమ్మెల్యే అనిరుధ్

వాగ్దానాలు అమలు చేయకుండా మోసగించిన కెసిఆర్

వాగ్దానాలు అమలు చేయకుండా మోసగించిన కెసిఆర్

హుజురాబాద్ సమగ్ర అభివృద్ధికి చర్యలు

హుజురాబాద్ సమగ్ర అభివృద్ధికి చర్యలు

కొత్త గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం
0:51

కొత్త గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం

డాక్టర్ నమ్రత కుటుంబం రూ. 50 కోట్ల ఆస్తులు జప్తు

డాక్టర్ నమ్రత కుటుంబం రూ. 50 కోట్ల ఆస్తులు జప్తు

రాహుల్ గాంధీకి సొంత ఇల్లు లేదు

రాహుల్ గాంధీకి సొంత ఇల్లు లేదు

పర్యాటక అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

పర్యాటక అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం..హైదరాబాద్‌లో దోశ, పూరి, వడ బంద్!

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం..హైదరాబాద్‌లో దోశ, పూరి, వడ బంద్!

ఆయిల్ పామ్ సాగులో మరింత అభివృద్ధి

ఆయిల్ పామ్ సాగులో మరింత అభివృద్ధి

వెలుగుమట్ల వివాదం.. ఎక్కడ కూల్చారో అక్కడే వారికి ఇళ్లు

వెలుగుమట్ల వివాదం.. ఎక్కడ కూల్చారో అక్కడే వారికి ఇళ్లు

📢 For Advertisement Booking: 98481 12870