హైదరాబాద్ Security Alert : ప్రాజెక్టుల వద్ద 24 గంటలు పహారా అప్రమత్తంగా ఉండండి – మంత్రి ఉత్తమ్: రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షాలు సంభవించే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖా హెచ్చరిస్తున్న నేపథ్యంలో నీటిపారుదల శాఖాధికారులు పోలీసులు రెవెన్యూ అధికారులతో సమన్వ యంగా ఉంటూ రోజంతా ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరా శాఖామంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి (N. Uttam Kumar Reddy) అధికారులను ఆదేశించారు. బుధవారం (Wednesday) నీటిపారుదల శాఖాధికారులతో నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, నాగార్జునసాగర్ , జూరాల, కడెంతో సహా ప్రధాన ప్రాజెక్టుల పై సమీక్ష చేశారు.

వీడియో కాన్ఫరెన్స్ నీటిపారుదల శాఖా ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, జాయింట్ సెక్రటరీ కే. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టర్లతో, నీటి పారుదల ఉన్నతాధికారులతో నిరంతరం సమాచారం (Constantly informed) అందించాలని ఆదేశాలు జారీచేశారు. నీటి పారుదల శాఖలో లష్కర్ నుంచి నీటిపారుదల సెక్రటరీ, ఇఎన్స్సి వంటి ఉన్నతాధికారుల వరకు అందరూ విధి నిర్వహణలో ఉండాలి.. ఎవ్వరూ సెలవులలో ఉండకూడదు, కాలువలు, చెరువులు, ప్రాజెక్టులు అన్నింటినీ ఎప్పటిక ప్పుడు పరిశీలన చేయండి. రాష్ట్రంలో ప్రాజెక్టులు, చెరువులు, కాలువల పరిస్థితి వాటి ఒ అండ్ ఎం విషయంలో తీసుకొన్న జాగ్ర త్తలపై చర్చించి ఎక్కడైనా లోపాలు ఉంటే వాటిని సవరించుకోవాలని తెలిపారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :