బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) మరోసారి బీసీలకు మద్దతుగా నిలిచారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు 40 శాతం బీసీ రిజర్వేషన్లు (40 percent BC reservations) అమలు చేయాలని ఆమె (Telangana) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మంలో విలేకర్లతో మాట్లాడిన కవిత, బీసీలకు హక్కులు ఇచ్చిన తరువాతే ఎన్నికలు జరగాలని స్పష్టంగా తెలిపారు.బీసీల హక్కుల కోసం పోరాటం తప్పదని కవిత పేర్కొన్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు జూలై 17న రైల్ రోకో చేపట్టనున్నట్లు ప్రకటించారు. బీసీ సోదరులు, ఖమ్మం ప్రజలు పెద్ద ఎత్తున ఈ ఉద్యమంలో పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు. బీసీల రిజర్వేషన్ల సాధన కోసం అందరూ కఠినంగా పోరాడాలని కోరారు.

బీజేపీపై బాణాలు – రిజర్వేషన్ల బాధ్యత రామచందర్‌రావుపై
తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు రామచందర్ రావు కేంద్రాన్ని ఒప్పించాలని కవిత అన్నారు. బీసీల హక్కులను సాధించేందుకు బీజేపీ నాయకులు ఏమి చేస్తున్నారు? అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు బీసీలకు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ నేతలు కూడా మాట నిలబెట్టుకోవాలన్నారు.కవిత ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు కక్ష సాధింపులో మునిగిపోవద్దని హెచ్చరించారు. బీఆర్ఎస్ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకోవడం తగదని అన్నారు.
ఖమ్మం నీటి సమస్యపై మంత్రులకు కవిత డిమాండ్
పోలవరం-బనకచర్ల నీటి వివాదం గురించిన ప్రశ్నను కూడా కవిత లేవనెత్తారు. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు దీనిపై స్పందించాలని కోరారు. ప్రజల సమస్యలపై మౌనం సరిఅయినది కాదని వ్యాఖ్యానించారు. బీసీ హక్కుల కోసం పోరాటం నిలకడగా సాగుతుందని స్పష్టం చేశారు.
Read Also : Harish Rao : కేసీఆర్ వాటర్ మ్యాన్ .. రేవంత్ రెడ్డి వాటా మ్యాన్ – హరీశ్‌రావు