బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవోపై హైకోర్టు విచారణకు సిద్ధమైంది. ఈ జీవోను సవాల్ చేస్తూ దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్ను(House motion petition) విచారణకు అంగీకరించింది.
మాధవరెడ్డి హైకోర్టును ఆశ్రయించిన అంశం
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని మూడుచింతలపల్లి మండలానికి చెందిన కేశవాపూర్ గ్రామానికి చెందిన మాధవరెడ్డి (Madhav Reddy)ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రభుత్వ జీవోతో పాటు బీసీ రిజర్వేషన్ల పరిమితిపై ఆయన సవాలు విసిరారు.
42 శాతం బీసీ రిజర్వేషన్లపై అభ్యంతరం
తాజాగా విడుదల చేసిన జీవో ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై అభ్యంతరం తెలిపిన మాధవరెడ్డి, ఈ జీవో రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు.
హైకోర్టు ధర్మాసనం విచారణకు అంగీకారం
ఈ హౌస్ మోషన్ పిటిషన్‌ను జస్టిస్ అభినందన్ కుమార్ శావిలి మరియు జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారించనుంది. పిటిషన్‌ను ప్రాధాన్యతతో పరిశీలిస్తూ విచారణ చేపట్టేందుకు హైకోర్టు అంగీకరించినట్లు సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Read Also: