హైదరాబాద్ : బీసీ బిల్లు (BC Bill) సాధన కోసం దీక్ష చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురానున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ధోరణిపై విరుచుపడిన ఆమె ప్రభుత్వానికి చిత్తశుద్ధే లేదంటూ విమర్శించారు. ఈమేరకు మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ బిహార్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ధర్నా చేపట్టిడ్రామా చేసిందని.. నిజంగా చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్షం ఏర్పాటు చేసి తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను ఢిల్లీకి (Delhi) తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. అఆగే అంబేడ్కర్ విగ్రహం సాధించడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 72 గంటల పాటు తాను దీక్ష చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎంత ఒత్తిడి వచ్చినప్పటికీ తలొగ్గకుండా దీక్ష చేశామని తాను దీక్ష విరమించిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒత్తిడికి తలొగ్గి అసెంబ్లీ లో అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారన్నారు. అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ తీరును కవిత తప్పుబట్టారు. ఢిల్లీలో ధర్నా చేస్తామన్న వ్యాఖ్యలపై మాట్లాడుతూ ఆనాడు చేసిన ధర్నాకే రాహుల్ గాంధీ హాజరు కాలేదన్నా కవిత ధర్మా కోసం తెలంగాణ వాదులను పిలిచే విధానం ఎంతో అవహేళనగా ఉందన్నారు. మర్యాద పాటించాలని, పద్ధతి పాటించాలంటూ కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ సాగదీత ధోరణి అవలంబిస్తోందన్న కవిత బీసీలకు అండగా ఉండాల్సిన సమయంలో బీజేపీ నేతలు తప్పిం చుకుని తిరుగు తున్నారంటూ విమర్శించారు. బీసీలు బాగుండాలని.. రాజ్యాధికారంలో బీసీలకు వాటా రావాలని ఆమె ఆకాంక్షిoచారు.
Read Hindi News : hindi.vaartha.com
Read also : Pahalgam: ఉగ్రవాదంపై పాక్ మద్దతు ఆపేంతవరకు చుక్కనీరు ఇవ్వం: భారత్