నేడు తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్ట్ (Maoist) పార్టీ గెరిల్లా లిబరేషన్ఆర్మీ చీఫ్ బరిసె దేవా లొంగిపోనున్నారు.. ఈయన, హిడ్మా తరువాత మావోయిస్టు పార్టీ (Maoist) .. సాయుధ బలగాల వ్యవహారాలు చూస్తున్నారు. మావోయిస్టుపార్టీకి ఆయుధాల సరఫరాలో దేవాది అత్యంత కీలకపాత్ర. దేవా నుంచి మౌంటెడ్ LMG వెపన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆయుధాలకు హెలికాప్టర్లను కూల్చే సామర్థ్యం ఉండటం గమనార్హం.మధ్యాహ్నం 12 గంటలకు డీజీపీ మీడియా సమావేశం ఉండనుంది.
Read also: Hussain Sagar: పిల్లలను కుర్చీలో కూర్చోబెట్టి సాగర్‌లో దూకిన తల్లి

ప్రభావం చూపనుంది
బరిసె దేవాతో పాటు మరికొందరు కీలక మిలిటరీ ఆపరేషన్ సభ్యులు కూడా లొంగిపోనున్నట్లు సమాచారం. ఈ లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ మిలిటరీ నెట్‌వర్క్ తీవ్రంగా దెబ్బతింటుందని పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో కొనసాగుతున్న మావోయిస్టు కార్యకలాపాలపై ఇది గణనీయమైన ప్రభావం చూపనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
తన లొంగుబాటు వెనుక కారణాలు, మావోయిస్టు పార్టీ అంతర్గత వ్యవహారాలపై కీలక విషయాలు వెల్లడించే అవకాశం ఉందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిణామం మావోయిస్టు ఉద్యమ భవిష్యత్తుపై కీలక మలుపుగా మారనుందని విశ్లేషకులు చెబుతున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: