हिन्दी | Epaper

Bangkok Earthquake : భూకంప తృటిలో తప్పించుకున్న తెలంగాణ ఎమ్మెల్యే కుటుంబం

Divya Vani M
Bangkok Earthquake : భూకంప తృటిలో తప్పించుకున్న తెలంగాణ ఎమ్మెల్యే కుటుంబం

Bangkok Earthquake : భూకంప తృటిలో తప్పించుకున్న తెలంగాణ ఎమ్మెల్యే కుటుంబం థాయ్‌లాండ్‌లో సంభవించిన భూకంపం నుంచి తృటిలో బయటపడి తెలంగాణ రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ కుటుంబం క్షేమంగా స్వదేశానికి చేరుకుంది. పెళ్లికి హాజరు కావాలని వెళ్లిన ఈ కుటుంబం అక్కడ భారీ భూకంపానికి గురైంది.శుక్రవారం సంభవించిన ఈ ప్రకృతి విపత్తులో మక్కన్ సింగ్ భార్య, పిల్లలు భయానక పరిస్థితులను ఎదుర్కొన్నారు.అయితే ఎలాంటి ప్రాణనష్టం లేకుండా స్వస్థలానికి చేరుకున్నారు.థాయ్‌లాండ్, మయన్మార్ దేశాల్లో సంభవించిన వరుస భూకంపాలు తీవ్ర నాశనాన్ని మిగిల్చాయి. వందల సంఖ్యలో భవనాలు కుప్పకూలగా, అనేక మంది మరణించారు. జనాలు భయంతో పరుగులు పెట్టారు.

Bangkok Earthquake భూకంప తృటిలో తప్పించుకున్న తెలంగాణ ఎమ్మెల్యే కుటుంబం
Bangkok Earthquake భూకంప తృటిలో తప్పించుకున్న తెలంగాణ ఎమ్మెల్యే కుటుంబం

ఈ భయానక పరిస్థితుల్లోనే ఎమ్మెల్యే మక్కన్ సింగ్ కుటుంబం కూడా చిక్కుకుంది.ఈ ఘటనపై ఎమ్మెల్యే భార్య మాట్లాడుతూ – “మేమంతా బ్యాంకాక్‌ లోని నొవాటెల్ హోటల్‌లో 35వ అంతస్తులో ఉన్నాం.శుక్రవారం ఉదయం భూకంపం రావడంతో భవనం ఊగిపోవడం మొదలైంది. వెంటనే నా పిల్లలతో కలిసి మెట్లు దిగి బయటకు పరుగెత్తాం.భూప్రకంపనలతో పైకప్పు ఊడిపోగా, భవనం ఒకవైపు ఒరిగిపోయింది. మేము బయటకు చేరుకునేలోపే కళ్లెదుటే పక్క భవనాలు నేలమట్టమయ్యాయి. ఆ దృశ్యాన్ని చూడగానే గుండె ఆగినంత పనయ్యింది,” అని ఆమె భావోద్వేగంగా తెలిపారు.తీవ్ర భయానక పరిస్థితుల నుంచి బయటపడి, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో వారికి ఘన స్వాగతం లభించింది. భార్య, పిల్లలను చూసి ఎమ్మెల్యే భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సంఘటన నుంచి సురక్షితంగా బయటపడ్డ తమ కుటుంబం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రేపు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కావూరి అంత్యక్రియలు

రేపు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కావూరి అంత్యక్రియలు

యుద్ధోన్మాది అమెరికా ప్రపంచ ప్రజల శత్రువు!

యుద్ధోన్మాది అమెరికా ప్రపంచ ప్రజల శత్రువు!

మున్సిపల్ కార్యాలయంలో వివాదం…!

మున్సిపల్ కార్యాలయంలో వివాదం…!

రాజకీయ నేతల గురించి ఒక్క పదంలో తేల్చేసిన కవిత

రాజకీయ నేతల గురించి ఒక్క పదంలో తేల్చేసిన కవిత

హైటెక్ అడుగులతో వ్యవసాయానికి స్వర్ణ యుగం

హైటెక్ అడుగులతో వ్యవసాయానికి స్వర్ణ యుగం

చట్టం అందరికీ సమానమేనా?

చట్టం అందరికీ సమానమేనా?

దానం, కడియంలకు భారీ ఊరట.. అనర్హత వేటు నుంచి క్లీన్ చిట్!

దానం, కడియంలకు భారీ ఊరట.. అనర్హత వేటు నుంచి క్లీన్ చిట్!

పతనం అంచున ప్రజారోగ్యం

పతనం అంచున ప్రజారోగ్యం

ఆ రాష్టాలతో పోల్చుకుంటే తెలంగాణ రైతులకే అప్పులు తక్కువ

ఆ రాష్టాలతో పోల్చుకుంటే తెలంగాణ రైతులకే అప్పులు తక్కువ

నర్మెట్టాలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి

నర్మెట్టాలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి

టీ – సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

టీ – సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టును సందర్శించిన NDSA బృందం

పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టును సందర్శించిన NDSA బృందం

📢 For Advertisement Booking: 98481 12870