రంగారెడ్డిజిల్లా,(శంషాబాద్) ,జనవరి 5, (ప్రభాతవార్త); దేశం ధర్మం పరిరక్షణ లో యువత బాధ్యత ఎంతో ఉంటుందని, అందుకే యువత ముందుండి నడవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) పిలుపునిచ్చారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ 44వ రాష్ట్ర మహాసభలు శంషాబాద్ నగరంలో జరుగుచున్నవి. మూడవరోజు భాగంగా సోమవారం
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ శంషాబాద్ నగరంలో నిర్వహించుకుంటున్న 44 వ రాష్ట్ర మహాసభలు జనమంచి గౌరీ శంకర్ యువ పురస్కార్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బండి సంజయ్ కుమార్ హాజరు కావడం జరిగింది.
Read Also: TPCC president news : బంగారు తెలంగాణను భ్రష్టు పట్టించారు

ఈ సందర్భంగా శ్రీ బండి సంజయ్(Bandi Sanjay) కుమార్ జనమంచి గౌరీ శంకర్ యువపురస్కార్ అవార్డు గ్రహీత అయినటువంటి భీమనపల్లి శ్రీకాంత్ గారికి జ్ఞాపికతో సత్కరించి 50000 వేల రూపాయలు బహుమతి ప్రధానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ దేశం కోసం ధర్మం కోసం ప్రాణత్యాగలకైనా వెనకాడని నిరంతరం శ్రమించి పోరాడే కార్యకర్తలు విద్యార్థి పరిషత్ కార్యకర్తలని అన్నారు. ఈ దేశంలో ఆర్టికల్ 370 రద్దు చేయాలని విద్యార్థి పరిషత్ అనేక ఉద్యమాలు కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు.
ఆర్టికల్ 370 రద్దు చేయడానికి ముఖ్య పాత్ర పోషించిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఇదే స్పూర్తితో పని చేస్తూ దేశ అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని అందరికీ సేవాభావం ఇప్పటినుంచే అలవాటు కావాలని తెలియజేశారు తదనంతరం సమరూప్ నిర్వహించి నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ అఖిలభారత సంఘటన మంత్రి బాలకృష్ణ జీ, దక్షిణ క్షేత్ర సంఘటన కార్యదర్శి చెరుకే శివకుమార్, జీ, ప్రాంత ప్రముఖ్ మాసాడి బాబురావు, ప్రాంత సంఘటన విష్ణువర్ధన్, జి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రావుల ,, రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు , గ్రేటర్ హైదరాబాద్ ప్రముఖ్ రామకృష్ణ , హైదరాబాద్ సంఘటన మంత్రి రాజశేఖర్ జీ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కందాడి శ్రీరామ్ , శంషాబాద్ విభాగ్ సంఘటన మంత్రి మల్లికార్జున్, జీ, శంషాబాద్ విభగ్ కన్వినర్ కళ్లెం సూర్య ప్రకాశ్, జిల్లా కన్వీనర్ పవన్, విద్యార్థుల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: