హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల(BC Reservations) సాధన కోసం వివిధ బీసీ సంఘాలతో ఏర్పడిన ‘బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ’ (బీసీ జేఏసీ) తలపెట్టిన ‘బంద్ ఫర్ జస్టిస్’కు(‘Bandh for Justice’) సీపీఐ తెలంగాణ రాష్ట్ర సమితి(Telangana Rashtra Samithi) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ నెల 18న జరగనున్న రాష్ట్ర బంద్‌లో ప్రత్యక్షంగా పాల్గొంటామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు వెల్లడించారు.
Read Also: IND vs WI : చాలా రోజుల తర్వాత టెస్ట్ సిరీస్ గెలిచిన భారత్

బీసీ జేఏసీకి సూచనలు, కేంద్రంపై విమర్శలు
రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ ఉద్యమ తరహాలోనే అన్ని రాజకీయ పార్టీలనూ కలుపుకుని ముందుకు సాగాలని బీసీ జేఏసీకి కూనంనేని సూచించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కొందరు వంకర వంకరగా మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ బిల్లులను ఆమోదించి, రిజర్వేషన్లను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైన కూడా ఉందని స్పష్టం చేశారు. “ఎవరూ స్పందించకుంటే కేంద్ర ప్రభుత్వమే రిజర్వేషన్లను అమలు చేసి, తామే చేశామని చెప్పుకోవచ్చు కదా?” అని ఆయన అన్నారు. పేద వర్గాల కోసం పోరాటం చేయడమే కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతమని ఆయన పేర్కొన్నారు. బీసీ హక్కుల సాధన సమితి ఈ నెల 15న చేపట్టనున్న రాస్తారోకోకు కూడా మద్దతు ఇవ్వాలని ఆయన బీసీ జేఏసీని కోరారు.
సీపీఐకి వినతి పత్రం, కార్యాచరణ
‘బంద్ ఫర్ జస్టిస్’కు మద్దతు ఇవ్వాలని కోరుతూ బీసీ జేఏసీ చైర్మన్ ఆర్. కృష్ణయ్య,(R. Krishnaiah) వర్కింగ్ ఛైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, కో-చైర్మన్ రాజారాం యాదవ్, మీడియా కోఆర్డినేటర్ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం సోమవారం హైదరాబాద్‌లోని(Hyderabad) మఖ్దూం భవన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుకు లేఖను అందజేశారు.
‘బంద్ ఫర్ జస్టిస్’ రాష్ట్ర బంద్ ఎప్పుడు జరుగుతుంది?
ఈ నెల 18న (శుక్రవారం) రాష్ట్ర బంద్ జరగనుంది.
ఈ బంద్‌కు ఎవరు సంపూర్ణ మద్దతు ప్రకటించారు?
సీపీఐ తెలంగాణ రాష్ట్ర సమితి సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: