హైదరాబాద్ : పోలవరం-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు వివరణాత్మక ప్రణాళిక నివేదిక (డిపిఆర్) తయారించడానికి పిలిచిన టెండర్లు తెలంగాణ ఒత్తిడికి తలొగ్గి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంరద్దుచేసుకొన్నా, మరొక కొత్త పేరుతో ఈ ప్రాజెక్టును చేపట్టే అవకాశం ఉందని తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి నల్లమడ ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్(CR Patil) తో న్యూఢిల్లీలో సమావేశమైన తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృష్ణా గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో సుదీర్ఘకాలం నుంచి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు ఇవ్వాలని కోరారు.
Read also : Marriage vs Career: యువతపై ఉపాసన, శ్రీధర్ వెంబు భిన్న వాదనలు

కృష్ణ గోదావరి నది జలాల్లో తెలంగాణ రాష్ట్ర(Telangana State) నీటి హక్కులను కాపాడాలని కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ను కోరారు. మంత్రిత్వశాఖతో సమావేశం అనంతరం ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతూ సుప్రీంకోర్టులో స్టే ఉన్నప్పటికిని కర్ణాటక ఆల్మట్టి డ్యాం ఎత్తును 524.25 మీటర్ల వరకు నిర్మించేందుకు ప్రయత్నిస్తోంది. ముందుకు వెళ్లకుండా కర్ణాటకను కేంద్ర ప్రభుత్వం కట్టడి చేయాలని కేంద్ర ప్రభుత్వంకు విజప్తిచేశామని అన్నారు. కర్నాటక ప్రభుత్వం తీసుకొచ్చిన జివోను కేంద్రజలశక్తి మంత్రిత్వశాఖకు అందజేశారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన కీలకమైన ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలనీ ఆయన అభ్యర్థించారు.
పోలవరం నుంచి గోదావరి వరద జలాల మళ్లింపునకు
పోలవరం నుంచి గోదావరి వరద జలాల మళ్లింపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ చర్యచేపట్టినా ఎగువ రాష్ట్రాలు కర్ణాటక మహారాష్ట్ర తమ వాటాలను గుర్తు చేస్తున్నాయనీ, ఆంధ్రప్రదేశ్ వరదల జలాల తరలింపును సాకుగా చూపి కర్ణాటక మహారాష్ట్ర నీటిమల్లింపులకు పాల్పడితే దిగున ఉన్న తెలంగాణకు నష్టం జరుగుతుందనీ తన ఆందోళనను జలశక్తి మంత్రిత్వశాఖ ముందుకు పెట్టానని ఉత్తమ్ వివరించారు. పోలవరం నుంచి వరద జలాలను తరలించే ఎపి ప్రయత్నాలను కేంద్రమే నిలువరించాలనీ కృష్ణానది సహజన న్యాయసూత్రాలకు అనుగుణంగా తెలంగాణకు అత్యధిక వాటా ఇవ్వాలని ఆయన సూచించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు డిపిఆర్ ను ఇప్పటికే కేంద్ర జల సంఘానికి సమర్పించామని తెలిపారు. 90 టిఎంసిల నీటి కేటాయింపులుగాను మొదటి దశలో మైనర్ ఇరిగేషన్లు పొదుపు కింద ఉన్న 45 టిఎంసిలకు వెంటనే అనుమతులు ఇవ్వాలని కోరానని చెప్పారు.
సమ్మక్క సాగర్ ప్రాజెక్టు పై లేవనెత్తిన అభ్యంతరాలను ఇప్పటికే నివృత్తి చేసామని, వెంటనే అనుమతులు ఇవ్వాలని జలశక్తి మంత్రికి చెప్పానని తెలిపారు. తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ మధ్య కృష్ణా జలాల పునః పంపిణీ పై ట్రిబ్యునల్ 2 విచారణ త్వరగా పూర్తయ్యేలా కేంద్రం చొరవ చూపాలని అన్నారు. ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన సాగునీటి సత్వర ప్రయోజన కార్యక్రమం కింద తెలంగాణలో ప్రాణహిత చేవెళ్ల, నారాయణపేట కొడంగల్ సమీకృత సీతారామ, సీతమ్మ సాగర్ పాలమూరు రంగారెడ్డి చిన్న కాళేశ్వరం మోడీ కుంట వాగు, చనఖాకోరాటా ప్రాజెక్టుల పూర్తి చేసేందుకు కేంద్రం తోడ్పాటు ను అందించాలని కోరినట్ల తెలిపారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read also :