తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు ముగిశాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభను నిరవధికంగా వాయిదా (Adjourned Sine Die) వేస్తున్నట్లు ప్రకటించారు. 5 రోజుల పాటు జరిగిన ఈ స్వల్పకాలిక సమావేశాల్లో ప్రభుత్వం అత్యంత వేగంగా వ్యవహరించింది. మొత్తం 13 బిల్లులు, రెండు కీలక తీర్మానాలను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రజా సమస్యలపై చర్చించేందుకు మొత్తం 40 గంటల 45 నిమిషాల సమయాన్ని కేటాయించడం గమనార్హం. పాలనలో పారదర్శకత, కొత్త పథకాల అమలుకు సంబంధించిన చట్టబద్ధమైన ప్రక్రియను ఈ సెషన్‌లో పూర్తి చేశారు.
KTR :కుటుంబంలో భేదాభిప్రాయాలు సహజమే!
ఈ సమావేశాల్లో అత్యంత ఆసక్తికరమైన అంశం కృష్ణా జలాలపై చర్చ. నదీ జలాల పంపిణీ, ప్రాజెక్టుల నిర్వహణను కేఆర్‌ఎంబీ (KRMB) కి అప్పగించే అంశంపై సభలో వాడివేడి చర్చ జరిగింది. అయితే, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ఈ కీలక చర్చకు ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి (BRS) దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అధికార కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య జరిగిన ఈ మాటల యుద్ధంతో సభలో రాజకీయ వేడి రాజుకుంది.

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యవహారం ఈ సెషన్‌లో హాట్ టాపిక్ అయింది. సమావేశాల తొలిరోజు అసెంబ్లీకి విచ్చేసిన ఆయన, రిజిస్టర్‌లో సంతకం చేసిన తర్వాత వెంటనే వెనుతిరిగారు. ఆ తర్వాత జరిగిన ఐదు రోజుల చర్చల్లో ఆయన ఒక్క రోజు కూడా పాల్గొనలేదు. ప్రతిపక్ష నేతగా ఆయన సభలో ఉండి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తారని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఇతర మంత్రులు కేసీఆర్ గైర్హాజరీపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com