హైదరాబాద్‌లో జరిగిన సామాజిక న్యాయ సమరభేరి సభ (Samajika Nyaya Bhari)లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బీజేపీ, ఆర్ఎస్ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. దేశ భద్రత, ప్రజల హక్కుల పరిరక్షణ విషయంలో కాంగ్రెస్ ఎప్పుడూ ముందుండిందని అన్నారు. “దేశం కోసం ప్రాణాలు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న పార్టీ కాంగ్రెస్ మాత్రమే. గాంధీ కుటుంబం నుంచి ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశానికి బలిదానం చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లో అలాంటి త్యాగాలు చేసిన వారెవ్వరైనా ఉన్నారా?” అంటూ ప్రశ్నించారు.
ఇందిరా గాంధీ చిత్తశుద్ధితో పోరాడారు – మోదీ యుద్ధాన్ని ఆపారు
పాకిస్తాన్‌కు తగిన బుద్ధి చెప్పిన నాయకురాలు ఇందిరా గాంధీయేనని ఖర్గే (Mallikarjun Kharge) గుర్తు చేశారు. “పాకిస్థాన్‌ను రెండు ముక్కలు చేసిన నాయకత్వం కాంగ్రెస్‌దే. కానీ నరేంద్ర మోదీ ఏమి చేశారు? పాక్‌ను అంతమొందిస్తామన్నారు. కానీ యుద్ధం జరిగే సమయంలోనే వెనక్కి తగ్గారు,” అని విమర్శించారు. ప్రధాని మోదీ మాటలకు, పనులకు పొంతన లేదని పేర్కొన్నారు. దేశ రక్షణ విషయంలో ఆయనకు తగిన దృష్టి లేదని అన్నారు.
మణిపుర్‌కి వెళ్తే లాభం లేదా? – ఖర్గే ప్రశ్న
42 దేశాల్లో పర్యటించేంత శక్తి ఉన్న మోదీకి మణిపుర్‌లో జరుగుతున్న హింసపై స్పందించే తలంపు లేదని ఖర్గే విమర్శించారు. “మణిపుర్‌లో మానవ హింస జరుగుతున్నా ప్రధాని చీకట్లోనే ఉన్నారు. బిహార్ ఎన్నికలపై ఎంత శ్రద్ధ చూపుతారో, అంత తక్కువగా దేశ భద్రతపై శ్రద్ధ చూపుతున్నారు,” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ తత్వంతో దేశాన్ని ఎలా రక్షిస్తారని ప్రశ్నించారు. దేశం కోసం నిజంగా పనిచేసే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని ఖర్గే స్పష్టంగా చెప్పారు.
Read Also : Kulaganana : ఏడాదిలోనే కులగణన చేసాం – సీఎం రేవంత్