తెలంగాణలో ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి అపోలో గ్రూప్ ముందుకొచ్చింది. రాష్ట్రంలో రాబోయే మూడేళ్లలో రూ.1700 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు ఆ సంస్థ సీఎస్ఆర్ వైస్ ఛైర్‌పర్సన్ ఉపాసన కొణిదెల (Upasana) ప్రకటించారు. ఈ పెట్టుబడి ద్వారా 24 వేలకు పైగా ఉద్యోగాలను సృష్టించనున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ మేరకు ఉపాసన తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు.
Read Also: Karuna Kitchen : రూ.1కి భోజనం కాదు, గౌరవం | సికింద్రాబాద్‌లో కరుణా కిచెన్ సేవ…
2,62,749 కుటుంబాలకు అండగా
తెలంగాణలో ఆరోగ్య సంరక్షణకు తమ అపోలో కుటుంబం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ముఖ్యంగా మహిళలు, యువత సాధికారతే లక్ష్యంగా ఈ ఉద్యోగాల కల్పన ఉంటుందని ఆమె వివరించారు. తమ గ్రూప్‌కు చెందిన వెయ్యికి పైగా ఫార్మసీల ద్వారా ఇప్పటికే ఏటా 2,62,749 కుటుంబాలకు అండగా నిలుస్తున్నామని ఉపాసన (Upasana) తెలిపారు.
ఈ కొత్త పెట్టుబడులతో రాష్ట్రంలో ఆరోగ్య సేవలను మరింత విస్తృతం చేయాలనేది తమ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. తాజా పెట్టుబడి ప్రకటనతో తెలంగాణ ఆరోగ్య రంగంలో మరిన్ని అవకాశాలు మెరుగుపడనున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: