తెలంగాణ రాష్ట్ర రెవెన్యూశాఖ (Telangana State Revenue Department) బలోపేతానికి ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక గ్రామ పరిపాలన అధికారి (GPO)ని నియమించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర రవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. గతంలో వీఆర్వో (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్), వీఏవో (విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్)గా పని చేసిన వారికి జీపీవోగా అవకాశం కల్పించేందుకు మరోసారి ప్రత్యేక పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
మునుపటి పరీక్షలో 3,453 మంది అర్హత
రాష్ట్రంలో గతంలో నిర్వహించిన ప్రత్యేక అర్హత పరీక్షలో 3,453 మంది వీఆర్వో, వీఏవోలు జీపీవోలుగా అర్హత సాధించినట్టు మంత్రి (Ponguleti Srinivas Reddy) తెలిపారు. ఈ పరీక్ష ద్వారా వారు ప్రస్తుతం గ్రామ పరిపాలనలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే మరెందరో అభ్యర్థులకు అవకాశం అందలేదు కాబట్టి, వారికి మరో అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మరోసారి పరీక్ష నిర్వహించనుంది. ఇది గ్రామ పరిపాలనలో సమర్థత పెంచే దిశగా ముఖ్యమైన ముందడుగు కానుంది.
భూసమస్యల పరిష్కారానికి ‘భూ భారతి’ చట్టం
రాష్ట్రంలోని భూసమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం “భూ భారతి” అనే కొత్త చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చిందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ఈ చట్టం ద్వారా భూముల రిజిస్ట్రేషన్, పట్టాదారు పాసులు, లెండ్ రికార్డుల శుద్ధి వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. జీపీవోలు గ్రామ స్థాయిలో భూసంబంధిత సమస్యల పరిష్కారానికి కేంద్రబిందువులుగా పనిచేస్తారని, అందుకే సమర్థవంతమైన నియామక ప్రక్రియతో వారికి అవకాశం ఇవ్వడం జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు.
Read Also : Tirumala : ఈ నెల 15, 16 తేదీల్లో వీఐపీ దర్శనాలు రద్దు