ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని, గుంటూరు వేదికగా ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన మూడో ప్రపంచ తెలుగు మహాసభలు నేటితో ముగియనున్నాయి. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన, అభిమానులు, సాహితీవేత్తలు, కవులు, రచయితలు, పరిశోధకులతో ఈ మహాసభలు ఉత్సవ వాతావరణంలో కొనసాగాయి. తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యం, చరిత్ర, భవిష్యత్ దిశపై జరిగిన చర్చలు, ఉపన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఈ మహాసభలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Read also: AP Sports: క్రీడాకారుల సంక్షేమమే ధ్యేయం: ఛైర్మన్ అనిమిని రవినాయుడు

ప్రత్యేక ఆకర్షణగా
ఈ సభల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, వెంకయ్యనాయుడు పాల్గొంటున్నారు. మహాసభల అనంతరం సీఎం ఐటీసీ హోటల్ కు వెళ్లి మారిషస్ అధ్యక్షుడు ధరమ్ గోకుల్ తో భేటీ అవుతారు. సాయంత్రం సచివాలయంలో ఆర్టీజీఎస్ పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: