బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్
హైదరాబాద్ : రాష్ట్రంలో గత మూడు, నాలుగు రోజుల్లో గురుకులాల్లో విద్యా ర్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఇది చాలా బాధకరం అని బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ (Anand Goud) అన్నారు. గత యేడాది అనేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, దాదాపు 100 మంది విద్యార్థులు మృతి చెందారన్నారు, ఈ సంవత్సరం పాఠశాలలు ప్రారంభమైన వెంటనే మళ్లీ విద్యార్థుల మరణాలు సంభవిస్తున్నాయన్నారు. గురుకులాల్లో విద్యార్థుల మరణాల అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి మేము ఇప్పటికే తీసుకెళ్లామని, సాధారణంగా బోనాల పండుగకు మేకలు, కోళ్లను బలిగా ఇస్తారు. కానీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మాత్రం పసిపిల్లలను బలితీసుకుంటుందని మండిపడ్డారు.
ఇతర మౌలిక సదుపాయాల కోసం
పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలన్న లక్ష్యంతో గురుకులాలను ప్రారంభించినా, రాష్ట్ర ప్రభుత్వ నిరక్ష్యం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. గురుకులాల్లో మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్ల సౌకర్యం, ఇతర మౌలిక సదుపాయాల కోసం తెలంగాణ బిసి
ఇప్పటికే రిప్రజెంటేషన్ ఇచ్చామని తెలిపారు. అనేక పాఠశాలల్లో సొంత భవనాలు లేవు, వానాకాలంలో కొన్నిటిలో వరదనీరు వస్తుంది, మరికొన్నింటిలో ఫుడ్ పాయిజన్ (Food poisoning) ఘటనలు తీవ్రంగా జరుగుతున్నాయి. ఈ ఇబ్బందులను పరిష్కరించాలంటూ, సమీక్ష చేసి కౌన్సిలింగ్ ఇచ్చేలా నిర్వాహకులను అప్రమత్తం చేయాలని కోరామన్నారు.

మానవతా దృష్టికోణం
పిల్లల భవిష్యత్తును నాశనం చేయొద్దని, ప్రాణాలు హరించొద్దని సైదులుకి ముందుగా వివరించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు తప్పిదాలు చేయడం, నిర్లక్ష్యం ప్రదర్శించడం అలవాటై పోయిందన్నారు. ఫలితంగా పేద విద్యార్థుల ప్రాణాలు కోల్పోతున్నారు. కనీస మానవతా దృష్టికోణం కూడా లేదన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం తూతూ మంత్రంగా సస్పెన్షన్లు మాత్రమే చేస్తూ, నామమాత్రపు చర్యలకే
పరిమితమవుతుందని, ఇది దురదృష్టకరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థుల ప్రాణాలంటే లెక్కలేదా? గడచిన 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా ఏడు గురుకుల విద్యార్థులు మరణించడం బాధాకరం అన్నారు.
ఫుడ్ పాయిజన్
సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలోని కస్తూర్బా పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని తనుషా మహాలక్ష్మి ఆత్మహత్య చేసుకుందని, మహబూబ్ నగర్ జిల్లా మల్దకల్లో హరికృష్ణ అనే విద్యార్థి పురుగుల మందు తాగి మృతి చెందాడని, ఫుడ్ పాయిజన్ ఘటనలు ఒక్కసారిగా కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పునరావృతం అవుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) మాటలు కేవలం ప్రకటనలకే పరిమితం. అవి కార్యరూపం దాల్చడంలేదు. గతంలో గురుకులాల్లో తనిఖీలు చేయాలని, అక్కడే రాత్రి బస చేయాలని ముఖ్యమంత్రి ప్రకటించారు. కాని అవేవీ అమలులో మాత్రం చూపలేదన్నారు.
బిజెపి ఓబిసి మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎవరు?
బిజెపి ఓబిసి మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆనంద్ గౌడ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఆనంద్ గౌడ్ ఏ పార్టీలో ఉన్నారు?
ఆనంద్ గౌడ్ భారతీయ జనతా పార్టీ (BJP)కు చెందిన నాయకుడు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Bhatti Vikramarka: మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించడమే లక్ష్యం – ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క