తెలంగాణ(Telangana) పోలీస్ శాఖ నేర విచారణలో వేగాన్ని, ఖచ్చితత్వాన్ని కొత్తస్థాయికి తీసుకెళ్లే దిశగా పెద్ద అడుగు వేసింది. రాష్ట్రంలోని AMBIS (Automated Multimodal Biometric Identification System) వ్యవస్థను పూర్తిగా ఆధునీకరిచే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. ఇప్పటివరకు ఉపయోగిస్తున్న పాతతరం సర్వర్లు, డేటా స్టోరేజ్ పరికరాలు పూర్తిగా మార్చి, తాజా జనరేషన్ టెక్నాలజీతో తయారైన హై-పర్ఫార్మెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇదంతా చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా ₹600 కోట్ల నిధులను కేటాయించింది. ఈ అప్‌గ్రేడేషన్ పూర్తయ్యాక సిస్టమ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్, మొబైల్ పరికరాలు, క్రైమ్ యూనిట్లన్నీ ఒకే నెట్‌వర్క్‌లో పనిచేయేలా ఇంటిగ్రేట్ అవుతుంది. దీతో విచారణలో సమయం గణనీయంగా తగ్గి, ఆధారాలు సేకరించడం మరింత సులభం కానుంది.
Read also: YCP: జమ్మలమడుగులో వైసీపీ కీలక నిర్ణయం

AI ఆధారిత బయోమెట్రిక్ మ్యాచింగ్ – సెకన్లలో ఫలితం
అప్‌గ్రేడ్ అయిన AMBIS వ్యవస్థలో కృత్రిమ మేధస్సు కీలకపాత్ర పోషిస్తుంది. AI ఆల్గోరిథమ్స్ సాయంతో వేలిముద్రలు, ముఖ గుర్తింపు, పామ్ప్రింట్ వంటి బయోమెట్రిక్ నమూనాలను కేవలం కొన్ని సెకన్లలోనే విశ్లేషించి, మ్యాచ్ చేస్తాయి. ముందుగా గంటలకొద్దీ పట్టిన డేటా వెరిఫికేషన్ ఇప్పుడు సూపర్-ఫాస్ట్ అవుతుంది. ఇది నేరస్తులను త్వరగా గుర్తించే అవకాశాన్ని పెంచడమే కాదు, మొదటి విచారణకు అవసరమైన ప్రాథమిక ఆధారాలు కూడా వేగంగా అందుబాటులోకి వస్తాయి. ప్రత్యేకించి ఇంటర్-స్టేట్ క్రైమ్ కేసుల్లో, పాత కేసుల ట్రేసింగ్‌లో ఈ టెక్నాలజీ పెద్ద మార్పు తీసుకువస్తుందని అధికారులు భావిస్తున్నారు.
సర్వ పోలీస్ స్టేషన్లకూ ఒకే డిజిటల్ కనెక్షన్
అప్‌గ్రేడ్ తర్వాత అన్ని పోలీస్ స్టేషన్లలోని బయోమెట్రిక్ పరికరాలు, మొబైల్ టాబ్లెట్లు, ఫీల్డ్ డివైసులు AMBISతో నేరుగా లింక్ అవుతాయి. ఒకే చోట ఉన్న డేటా రిపాజిటరీ ద్వారా రాష్ట్రంలో ఎక్కడైనా పోలీసులు రియల్-టైమ్‌లో సమాచారాన్ని యాక్సెస్ చేయగలరు. కేసు ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు వెళ్లినా, సమాచారం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా అవుతుంది. ఇది మొత్తం పోలీసులు వ్యవస్థలో సమన్వయాన్ని, ప్రతిస్పందన వేగాన్ని అమూల్యంగా మెరుగుపరుస్తుందని అధికారులు చెబుతున్నారు.
AMBIS అంటే ఏమిటి?
బహుళ బయోమెట్రిక్ డేటాను ఉపయోగించి నేరస్థులను గుర్తించే అధునాతన సిస్టమ్.
తెలంగాణలో AMBIS అప్‌గ్రేడ్ కోసం ఎంత నిధులు కేటాయించారు?
ప్రభుత్వం ₹600 కోట్లు మంజూరు చేసింది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/