हिन्दी | Epaper
రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు

క్షమాపణలు చెప్పిన సీవీ ఆనంద్‌

sumalatha chinthakayala
క్షమాపణలు చెప్పిన సీవీ ఆనంద్‌

హైదరాబాద్‌: పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. అల్లు అర్జున్, సంధ్య థియేటర్‌దే తప్పిదమని పోలీసులు చెబుతుంటే.. కాదు పోలీసులు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, వ్యక్తిగతంగా తనను దిగజార్చే ప్రయత్నం జరుగుతుందని నటుడు, ఆయన కుటుంబం చెబుతోంది. ఈ క్రమంలో ఆదివారం సైతం తెలంగాణ డీజీపీ జితేందర్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఏసీపీ పలువురు ఆ ఘటనపై కామెంట్స్ చేశారు.

సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట మహిళ మృతి కేసు కోర్టు పరిధిలో ఉందన్నారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్. ఆరోజు ఏం జరిగిందో పోలీసులు కొన్ని వీడియోలు విడుదల చేసి స్పష్టత ఇచ్చారు. ఈ క్రమంలో మీడియా సీవీ ఆనంద్‌ను కొన్ని విషయాలు ప్రశ్నించగా.. నేషనల్ మీడియాను కొనేశారు. అందుకే అక్కడ వార్తలు అలా ప్రచారం అవుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ నిజంగానే నేషనల్ మీడియాకు డబ్బులు ఇచ్చారా, అందుకు మీతో ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని సీవీ ఆనంద్ పై అర్ధరాత్రి నుంచి సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం మొదలైంది. దీంతో దిగొచ్చిన ఐపీఎస్ సీవీ ఆనంద్ తమ మాటలు వెనక్కి తీసుకున్నారు. జాతీయ మీడియాపై తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పారు.

జాతీయ మీడియాపై తనను కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు ప్రశాంతతను కోల్పోయి వ్యాఖ్యలు చేశాను. అందుకుగానూ క్షమాపణలు కోరుతున్నాను. పరిస్థితి ఎలా ఉన్నా సంయమనం పాటించాల్సి ఉంటుంది. నేను చేసిన తప్పిదంగా భావించి, నా వ్యాఖ్యలను మనస్ఫూర్తిగా వెనక్కి తీసుకుంటున్నాను అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసి వివాదానికి స్వస్తి పలికారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870