రాష్ట్రస్థాయి వర్క్ షాప్ పలువురు వక్తలు
హైదరాబాద్ (అత్తాపూర్) : వ్యవసాయ రంగంలో బయోటెక్నాలజీ వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు. గురువారం బయోటెక్నాలజీ సాధ నాల వినియోగంపై రాష్ట్ర స్థాయి వర్కుషాప్ నిర్వహించారు. వంటల అభివృద్ధికి బయోటెక్నాలజీ వినియోగం, ముఖ్యమైన పురోగతులు అనే శీర్షికతో సదస్సును ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంతో బయోటెక్ కన్సార్టియం ఆఫ్ ఇండియా లిమిటెడ్ (Biotech Consortium of India Limited) సంయుక్తంగా నిర్వహించాయి.. ఫెడరేషన్ ఆఫ్ సీడ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా మద్దతు ఇచ్చింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ ఆర్ఎం సుందరం, బయోసీడ్స్ డివిజన్, డీసీఎం శ్రీరామ్ లిమిటెడ్ డాక్టర్ పరేష్ వర్మ, బయోటెక్ కన్సార్టియం ఆఫ్ ఇండియా లిమిటెడ్ చీఫ్ జనరల్ మేనేజర్ డాక్టర్ విధా ఆహుజా, ఐసీఏఆర్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్ మాజీ డైరెక్టర్ డాక్టర్ వైజీ ప్రసాద్లు హాజరై మాట్లాడారు…
అధికారుల నుంచి పాలసీ మేకర్ల వరకు
బయోటెక్నాలజీ ఆవిష్కరణలను అర్ధం చేసుకోవడానికి, సమర్థవంతంగా ప్రజలకు వివరించడానికి, బాధ్యతగా అమలు చేయడానికి అధికారుల నుంచి పాలసీ మేకర్ల వరకు సామర్థ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉండన్నారు. భారత్ గత కొన్ని దశాబ్దాలుగా వ్యవసాయ ఉత్పాదకతలో పురోగతి సాధించిందన్నారు. అయినా, భవిష్యత్తు అవసరాల కోసం భూమి విస్తీర్ణాన్ని పెంచడం కాకుండా, సాంకేతిక పురోగతి (Technological progress) పై దృష్టి పెట్టాలని కోరారు. బయోటెక్నాలజీ అనేది తుది లక్ష్యం కాదన్నారు. కానీ స్థిరమైన వ్యవసాయం సాధించడానికి ముఖ్యమైన మార్గమన్నారు. జన్యు మార్పు ద్వారా తక్కువ ఎరువులు, తక్కువ నీటితో అధిక దిగుబడి ఇచ్చే పంటలు సాధ్యమన్నారు.

దీని వల్ల రైతులకు తక్కువ ఖర్చు
తెగుళ్ల, పోషక వంటలు అవుతుందన్నారు. వాతావరణ మార్పులు, తెగుళ్లకు తట్టుకునేలా మారతాయని తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అయిన వాతావరణ మార్పులు, లోపాలు పరిష్కరించేందుకు ఇప్పుడు శాస్త్రవేత్తలకు జన్యు మార్పు, జీనోమ్ ఎడిటింగ్ అనే రెండు శక్తివంతమైన టెక్నాలజీలు అందు జాటులో ఉన్నాయని చెప్పారు. శాస్త్రీయ అభివృద్ధిని ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు, రైతు సముదాయాలతో చర్చలు జరపడం అవసరమని సూచించారు. ఈ చర్చలు పత్తి వంటల నుంచి జన్యు సవరణ వంటలపై ఉన్న నియంత్రణ విధానాల వరకు చేశారు. ఈ చర్చలో ఫీల్డ్ ట్రయల్స్ కు అనుమతుల ప్రక్రియను సరళతరం చేయాలని, రైతులు, ప్రజలతో
వర్క్ షాప్ లో పాల్గొన్న ముఖ్యఅతిథులు
కమ్యూనికేషన్ చేయడానికి కొత్త వ్యూహాలు అమలు చేయాలని అభిప్రాయపడ్డారు. వ్యవసాయ బయోటెక్నాలజీపై చర్చలు జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పాలసీ తీసుకున్నా బయోటెక్నాలజీని ఎంత వేగంగా. ఎంత విస్తృతంగా అమలు చేయాలో నిర్ణయించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని చెప్తారు.
వ్యవసాయ రంగానికి తండ్రి ఎవరు?
భారతదేశంలో ఎం.ఎస్. స్వామినాథన్‌ను “హరిత విప్లవం తండ్రి”గా, అలాగే వ్యవసాయ రంగానికి తండ్రిగా పరిగణిస్తారు. ఆయన వ్యవసాయ శాస్త్రంలో మరియు ఆహార భద్రతలో చేసిన కృషి వల్ల ఈ బిరుదు దక్కింది.
భారతదేశంలో వ్యవసాయ రంగం అంటే ఏమిటి?
భారతదేశంలోని వ్యవసాయ రంగం దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన భాగం. ఇది పెద్ద సంఖ్యలో ప్రజలకు ప్రధాన జీవనాధారం అందిస్తోంది. ఈ రంగంలో పంటల సాగు, తోటల పంటలు (హార్టికల్చర్), పశుసంవర్ధక, చేపల పెంపకం వంటి విభిన్న కార్యకలాపాలు ఉంటాయి. భారత్ ప్రపంచంలోనే అగ్రగామి వ్యవసాయ ఉత్పత్తిదారులలో ఒకటి. ముఖ్యంగా బియ్యం, గోధుమలు, సుగంధ ద్రవ్యాలు, పాలు వంటి పంటల ఉత్పత్తిలో ముందంజలో ఉంది. దేశ ఆహార భద్రతను నిర్ధారించడంలో కూడా ఈ రంగం ముఖ్య పాత్ర పోషిస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also :