గత ఏడాది కంటే 18 శాతం ఎక్కువ సరఫరా: వ్యవసాయ కార్యదర్శి సురేంద్ర
హైదరాబాద్: రాష్ట్రంలో యూరియా కొరత లేదని వ్యవసాయ కార్యదర్శి సురేంద్ర మోహన్ తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ రోజు వరకూ దాదాపు 18 శాతం అధికంగా యూరియాను సరఫరా చేసినట్లు చెప్పారు. హైదరాబాద్లో మంగళవారం జరిగిన వీడియోకాన్ఫరెన్స్ రాష్ట్రంలో వ్యవసాయ కార్యకలాపాలు వేగంగా సాగుతున్న తరుణంలో యూరియా సరఫరాను పర్యవేక్షించాలని సూచించారు. వ్యవసాయేతర వినియోగానికి యూరియా (Urea) ను మళ్లించే అవకాశం ఉన్నందున వాటిని ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలన్నారు. అలాగే యూరియాకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో 24 గంటలూ పనిచేసేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. యూరియా నిల్వలు, మళ్లింపు, బ్లాక్ మార్కెటింగ్ జరుగుతున్నట్లయితే రైతులు 8977741771కు ఫోన్ చేయాలన్నారు.
తదితరులు పాల్గొన్నారు
అలాగే సహకార సంఘాల్లో యూరియా స్టాక్ బోర్డును ప్రదర్శించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని సంఘాలు ఉదయం 8 నుండి అందుబాటులో ఉండాలని వెల్లడించారు. రైతులకు సకాలంలో యూరియాను సరఫరా చేయాలని ఆదేశించారు. రాష్ట్ర సరిహద్దుల వద్ద యూరియా తరలింపును తనిఖీ చేసి తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ డైరక్టర్ డాక్టర్ బి గోపి (B. Gopi) తదితరులు పాల్గొన్నారు.తీవ్రమవుతున్న యూరియా కొరత రోడెక్కుతున్న అన్నదాతలు యూరియా కొరత రాష్ట్రంలో రాను రాను తీవ్రమవుతోంది. యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. వారం రోజలుగా యూరియా సరఫరా లేదు.

అర్ధరాత్రి నుంచే
రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల కోసం రైతులు డిపోల వద్ద పడిగాపులు పడుతున్నారు. ఎరువుల డిపోల వద్ద పెద్ద సంఖ్యలో రైతులు గుమిగూడుతుండటంతో పోలీసు భద్రత ఏర్పాటుచేయాల్సి వస్తుండటం గమనార్హం. అర్ధరాత్రి నుంచే రైతులు బారులు తీరడం, కొన్నిచోట్ల చెప్పులు, సంచులు క్యూలై న్లలో ఉంచడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. వికారాబాద్ జిల్లా, ధారూరు మండల కేంద్రం, హరిదాసుపల్లి పీఏసీఎసలకు రెండు లారీల యూరియా వచ్చింది. దీంతో రైతులు యూరియా కోసం ధారూరు పీఏసీఎస్ కార్యాలయం (Dharur PACS Office) ముందు క్యూ కట్టారు. యూరియా 500 బస్తాలే రావటంతో రైతుకు రెండు బస్తాల చొప్పున 250 మంది రైతులకు ఇచ్చి సరిపెట్టారు. యూరియా కొరతపై సంబంధిత అధికారులు పట్టించుకోవటం లేదనేది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదే సమస్యపై
అలాగే మహబూబ్ నగర్ జిల్లాలో యూరియాకు కొరత తలెత్తుతోంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సింగిల్ విండో సహకార సంఘాలు నిధులు లేవన్న సాకుతో తమకు కేటాయించిన దానికి అనుగుణంగా యూరియా తెప్పించుకోలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో మక్తల్ తదితర ప్రాంతాల్లో సహకార సంఘాల వద్ద రైతులు యూరియా కోసం పాస్బుక్కులను బారులుగా పెట్టి కావు కాయాల్సిన పరిస్థితి తప్పడం లేదు. అలాగే యూరి యా కొరత ఏర్పడి రైతులు ఆందోళన బాటపట్టారు. ఇదే సమస్యపై కొద్ది రోజులుగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల నిరసన తెలిపిన రైతులుహనుమకొండ జిల్లా శాయంపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లిలో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించారు.
యూరియా అంటే ఏమిటి?
యూరియా అనేది కార్బానిక్ ఆమ్లం యొక్క డైఅమైడ్ (Diamide of carbonic acid). దీని రసాయన పరమైన ఫార్ములా H₂NCONH₂. ఇది రంగులేని, స్ఫటికాకార పదార్థం.
యూరియా యొక్క ప్రధాన ఉపయోగాలు ఏమిటి?
ఎరువుగా వ్యవసాయంలో ఉపయోగిస్తారు. పంటలకు నత్రజని (Nitrogen) సరఫరా చేస్తుంది.ప్లాస్టిక్‌లు, ఔషధాల తయారీకి ప్రారంభ పదార్థంగా ఉపయోగిస్తారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Rajagopal : మంత్రి పదవి కంటే కూడా మునుగోడు ప్రజలే ముఖ్యం – రాజగోపాల్