నల్గొండ జిల్లాలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డుప్రమాదం(Accident) కలకలం రేపింది. చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి సమీపంలో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి (NH-65)పై ఇన్నోవా కారు యూ-టర్న్ వద్ద అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఢీ కొట్టిన వెంటనే కారు పల్టీ కొట్టి, ఇంజిన్ భాగంలో మంటలు చెలరేగడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది.
Read Also: Steve Waugh: రోహిత్, కోహ్లీల కెరీర్ చివరి దశలో ఉంది: స్టీవ్ వా

ప్రమాద సమయంలో కారులో ఎనిమిది మంది ప్రయాణికులు(Accident) ఉన్నారు. వారు అప్రమత్తంగా స్పందించి సకాలంలో వాహనం నుంచి బయటకు దూకడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు.
కారు రోడ్డుపై అడ్డంగా పడిపోవడంతో హైదరాబాద్–విజయవాడ హైవేపై కొంతసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అనంతరం పోలీసులు, రహదారి సిబ్బంది వాహనాన్ని పక్కకు తరలించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: