తెలంగాణ మొత్తం ఇప్పుడు వర్షాల నీటిలో తడిసి ముద్దవుతోంది. వరంగల్, నల్గొండ జిల్లాల్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది.గత రెండు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంగా మారాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద నీరు ఇళ్లలోకి ప్రవేశించింది.వాతావరణ శాఖ హైదరాబాద్‌కి ఆరెంజ్ అలర్ట్ జారీ (Orange alert issued for Hyderabad) చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారుల సెలవులను రద్దు చేశారు. 72 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

కొన్ని జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు
మహబూబ్‌నగర్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి, జనగామ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు (School holidays) ప్రకటించారు. వర్షాలు తగ్గే వరకు విద్యాసంస్థలు మూసి ఉంచాలని నిర్ణయించారు.13, 14 తేదీల్లో వర్షాల కారణంగా సెలవులు. 15న స్వాతంత్ర్య దినోత్సవం. 16న కృష్ణాష్టమి, 17 ఆదివారం. దీంతో మొత్తం ఐదు రోజుల సెలవులు వచ్చాయి.హైదరాబాద్ పరిధిలో మాత్రం స్కూళ్లకు మధ్యాహ్నం వరకే తరగతులు ఉన్నాయి. మధ్యాహ్నం తర్వాత స్కూల్ తెరిస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
పూర్తి సెలవు డిమాండ్ పెరుగుతోంది
వర్షాల దృష్ట్యా హైదరాబాద్‌లో పూర్తి సెలవు ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కానీ అధికారులు పరిస్థితి బట్టి నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు.జీహెచ్‌ఎంసీ నగరంలో సహాయక చర్యలు చేపడుతోంది. 269 వరదప్రాంతాలను గుర్తించినట్లు కమిషనర్ కర్ణన్ తెలిపారు. అన్ని శాఖలతో కలిసి సహకార చర్యలు చేస్తున్నారు.
బయటకు రావొద్దని అధికారులు సూచన
నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ విజ్ఞప్తి చేసింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. జలమండలి, విద్యుత్ శాఖ, ట్రాఫిక్ విభాగాల సమన్వయం కొనసాగుతోంది.వాతావరణ శాఖ ప్రకారం, రానున్న మూడు రోజులు వర్షాల ప్రభావం కొనసాగుతుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ సూచనలను పాటించాలి.
Read Also : E20 Petrol : పెట్రోల్ వాడుతున్నారా? కేంద్రం చెప్పిన నిజాలు